అర్జున్ – పరిణీతి కాంబినేషన్ మళ్ళీ హిట్టు కొడుతుందా ? - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ – పరిణీతి కాంబినేషన్ మళ్ళీ హిట్టు కొడుతుందా ?

July 10, 2017

2012 లో హిందీలో వచ్చిన ‘ ఇషాక్ జాదే ’ సినిమా గుర్తుంది కదా. దానితోనే కదా అర్జున్ కపూర్, పరిణీతి ఛోప్రాలు బాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంభినేషన్ రిపీటౌతోంది. దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో ఈ కొత్త సినిమా ఈ నెలాఖరులో స్టార్ట్ అవనుంది. దిబాకర్ గతంలో ఖోస్లా కా ఘోస్లా, బాంబే టాకీస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరో హీరోయిన్ల గురించి. ఇషాక్ జాదేలో ఎక్సెలెంటుగా నటించి ఎంతగా ప్రశంసలు అందుకున్నారో మనకు తెలిసిందే.

ఇద్దరు ఇండస్ట్రీకి డెబ్యూనే అయినా తమ పర్ ఫార్మెన్స్ తో బాలీవుడ్ ను షేక్ చేసారు. ఇద్దరు సీనియర్ నటీనటుల కన్నా చాలా బాగా చేసారనే పేరుకూడా సంపాదించుకున్నాడు. మళ్ళీ ఇద్దరు కలిసి ఏ సినిమాలోనూ నటించకపోవడం ఇప్పుడు ఈ సినిమా మీద ఇంట్రెస్టును క్రియేట్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత రిపీటవుతున్న వీళ్ళ కాంబినేషన్ బాలీవుడ్ కు ఇంకొక హిట్టునిస్తుందేమో చూడాలి.