పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న  హీరో - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న  హీరో

April 24, 2019

ఇప్పుడంతా మోడ్రన్ కల్చర్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మోడ్రన్ కల్చర్‌తో అసలు సాంప్రదాయానికి విఘాతం కలుగుతోందని సాంప్రదాయవాదుల వాదన. వాళ్ల వాదన వారిదే.. మా దారి మాదే అన్న రీతిన సాగుతున్నారు నేటి యువత. అలాంటి యువతకు దిశా నిర్దేశకులుగా మారుతున్నారు సినీ కళాకారులు. పిల్లను చూడాలి, పెళ్లి చేసుకోవాలి, ముహూర్తాలు గట్రా పెట్టుకుని శోభనం జరగాలి.. ఇంత ప్రాసెస్ వుంటుంది పిల్లలు కనాలంటే. అవన్నీ లేకుండా కూడా పిల్లలను కనొచ్చు అంటున్నారు ట్రెండ్‌ను ఫాలో అయ్యేవారు. అదెలాగో మీకు ఇప్పటికే బుర్రలో స్పార్క్‌లా మెదిలింది కదూ. లవ్ ముదిరితే లివ్ ఇన్ రిలేషన్ అన్నది ఎంత నిజమో.. ఆ రిలేషన్ ముదిరితే పిల్లలను కూడా కనడం అంతే సులభం మరి.

ఈ క్రమంలో బాలీవుడ్‌ నిర్మాత కరణ్ జోహార్ ఆమధ్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చాడు. కాకపోతే ఇతను ఎవరితోనూ రిలేషన్‌లో లేడు. సరోగసీ పద్ధతిలో బిడ్డలను కన్నాడు. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తండ్రి కాబోతున్నాడు. ఇతను తన ప్రియురాలు గాబ్రియేలాతో గత కొంత కాలంగా రిలేషన్‌లో వున్న విషయం తెలిసిందే. ఈ జంట పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిస్తోంది. ఈ విషయాన్ని అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. నిండు గర్భిణిగా ఉన్న గాబ్రియేల్లాను గుండెలకు హత్తుకుని ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే 46 ఏళ్ళ అర్జున్ రాంపాల్‌కు గతంలో పెళ్లి అయి గతేడాదే విడాకులు కూడా అయ్యాయి. మెహర్ జెస్సియా అతని మొదటి భార్య. వారికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. గత సంవత్సరం నుంచి  గాబ్రియేలాతో కలిసి సహజీవనం చేస్తున్న అతను త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపాడు.