‘అర్జున్ రెడ్డి’.. సగటు ప్రేక్షకుని దృష్టిలో..! - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’.. సగటు ప్రేక్షకుని దృష్టిలో..!

August 26, 2017

అర్జున్ రెడ్డి సినిమా చూసినంక పెద్దవాళ్లకే ఈ సినిమా అన్న రీతిలో జరిగిన ప్రచారం ముమ్మాటికీ.. ఇన్నాళ్ల పాటు తెలంగాణ కళను అణగదొక్కిన ధోరణిలో చేసిన ప్రచారంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమా ఒక అన్‌కన్వెన్షనల్ మూవీగా చెప్పచ్చు. ఇన్నాళ్లు హీరో అంటే కత్తులు, కటార్లు, కంఠం పగిలే డైలాగులు, అటు ఇటు ఏడు తరాల తమ పనికి మాలిన కుటుంబాల చరిత్రలు చెప్పే హీరో పాత్రలకే హీరోయిజం ఉందనుకునే మూస ధోరణికి ‘అర్జున్ రెడ్డి’ పాత్ర చిత్రణ ద్వారా సమాధి కట్టినట్టయింది. తెలివైన యువకుడికి విపరీతమైన కోపం ఉంటే దాన్ని నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా చూపిస్తూ, కాలేజీ రోజుల్లో అడ్మైర్ అయ్యే మన మిత్రులను, కొంత మంది డేరింగ్ అండ్ డ్యాషింగ్  యువకులను గుర్తుకు తెచ్చే నిజ జీవితపు హీరోయిజం ఇందులో కనిపిస్తుంది.

కేవలం ముద్దులు, సెక్స్, డ్రగ్స్, సిగరెట్లు, బూతులు ఇవే కనిపిస్తాయంటూ రివ్యూల పేరిట తమ పక్షపాత  దృక్పథాన్ని చూపించుకున్న, కొంత మంది గుడ్డి సమీక్షకుల తెలివి తెల్లారింది. ప్రతి సినిమా ఒక అర్ట్ పార్మ్, ఒక పెయింటింగ్ లోని పలు అంశాలు ఒక్కో మేసేజ్ చూపినట్లు, అర్జున్ రెడ్డి సినిమా ఆసాంతం అద్భుతమై, ఆర్ద్రమైన సందేశాన్ని నింపే ఒక మూడు గంటల రెండుల నిముషాలపాటు నడిచే చిత్రం. సినిమాలో ముద్దుల గురించి రోడ్లెక్కి బట్టలు చించుకుంటున్న ముసలి నేతలకు అర్జున్ రెడ్డి లాంటి కల్మషం లేని యువకుల అలోచనలు, ప్రేమ అర్ధం అవుతాయనుకోవడం లేదు. అన్నింటిని అల్కగా తీసుకునే ఒక యువకుడు జీవితం మెత్తం తనకు నచ్చిన యువతి కోసం అర్పించేంత ప్రేమ ఉన్నప్పుడు, దాన్ని చెప్పే క్రమంలో పెట్టే ప్రతి ముద్దు అమోదయోగ్యమైనదే. సినిమాలో ఉన్న పదుల సంఖ్యల ముద్దుల్లో కామం.. క్షణం మాత్రంమైనా కనిపించదు. పాటల పేరు చెప్పి విదేశాల్లో షూటింగులు, బికినీ సైజులో హీరోయిన్లకు డ్రెస్సులు వేసి, తొడలు, నడుములు పట్టుకుని హీరోలు చేసే చీప్ డాన్సులు, ఐటెం సాంగుల అబ్సీనిటీ ఈ సిమాలో లేదని గుర్తుంచుకోవాలి.   

ఇక బూతు మాటలున్నాయాంటు మాట్లాడే వారు గుర్తు చేసుకోవాల్సింది, మన ఇళ్లల్లో ఏరినైనా వేధిస్తే మాట్లాడే మెదటి మాట కచ్చితంగా “మాదర్ చొద్’’ దే. లేదా అంతకన్న ఎక్కువే. ఇక సినిమాలో “అర్జున్ రెడ్డి” మందుతాగుడు, డగ్స్ తీసుకునుడు కూడా ఏమాత్రం అసహజంగా లేదు.  అనాటి అక్కినేని నాగేశ్వర్ రావు నుంచి నేటి హిందీ సినిమా అషికీ టూ వరకు ప్రేమ విఫలం అయిన యువకుడు మందు తాగే ట్రెండ్‌నే ఈ సినిమాలో కొనసాగించారు.  క్షణం సైతం దూరం చేసుకోలేని తన భాగస్వామి చేరుకోలేనంత దూరం అయితే కలిగే బాధ, తమ జీవితంలో ఎవరినైన ప్రేమించిన ప్రతి ఒక్కరికి అర్ధం అవుతది. మందు తాగడం, తాగినాక గుండెల్లోని భాదను తమ స్నేహితులతో పంచుకోవడం, తన ప్రేమను మర్చిపోయేందుకు బలవంతంగా తప్పులు చేసే విఫల ప్రయత్నాలు, ప్రతి ఒక్క విఫల ప్రేమికుడి పాత కాలపు జ్ఝాపకాలే.

మన జీవితాన్ని ప్రభావితం చేసే అమ్మాయికి ఏమైనా అయితే కచ్చితంగా మన జీవితానికి నష్టం కలుగుతుందంటూ, అలాంటి అమ్మాయిని కాపాడుకోవాలంటూ చెప్పే డైలాగ్, మా రిలేషన్ షిప్పు రిజస్టర్ కాలేదని, దాన్ని తక్కువ చూడదంటూ హీరోయిన్ తండ్రికి అర్జున్ రెడ్డి చెప్పే ఒక్క డైలాగ్, ‘అరె వీడు అడవాళ్లను అబెక్టిఫై చెస్తున్నడు వీడికి మన చెల్లితో పెళ్లి అవసరమా’ అంటూ హీరో ప్రెండ్‌కు చెప్పే మాటలు అర్జున్‌రెడ్డి అసలైన క్యారెక్టర్‌కు నిదర్శనాలు. ఈ సినిమా చూసినంక హీరో విజయ్ కచ్చింతంగా తెలుగు సినిమాకు దొరికిన గొప్ప ఆస్ధిగా చెప్పచ్చు. ఈ సినిమా ద్వారా మూస ధోరణిలో కాకుండా బేర్ రియాలిటీ, ఒక షాకింగ్ అండ్ టైట్ స్ర్కీన్ ప్లేతో కాలేజీ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగం ఉన్న ప్రేమకథను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ వంగాకు అభినందనలు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేములో కనిపించే హీరో ప్రెండ్ రాహుల్ రామకృష్టకు ప్రత్యేక దన్యవాదాలు. తెలుగు సినిమాలో తెలంగాణ యాసకు పట్టం కట్టేలా తనకు తానే డైలాగులు రాసుకున్న రాహుల్ మరిన్ని సినిమాల్లో కచ్చింతంగా కనిపిస్తాడు.

ఇక ప్రేమంటే కేవలం ఇద్దరి మద్యన ఉన్న జస్ట్ ప్లేష్ అండ్ బ్లడ్ మాత్రమే కాదని, ఒకరిని విడిచి మరోకరు సంతోషంగా ఉండలేని, విడదీలేని సెల్ఫ్ రియలైజేషన్ అంటు సినిమాను ముగించిన తీరు ఈ రోజుల్లో ప్రేమంటే సెక్స్ మాత్రమే అనుకునే వారికి కనువిప్పు అని చెప్పవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే హిపొక్రసీ లేకుండా తనకు తెల్సిన తన మనసు మాటవినే ఒక దైర్యవంతుడి కథ అర్జున్ రెడ్డి, మనం కూడా ఎలాంటి విలువలు, నీతులంటూ మనకు లేని వాటి గురించి ఎక్కువ అలోచించకుండా నిజాయితీగా, హిపొక్రసీ లేకుండా చూస్తే కచ్చితంగా నచ్చుతుంది.  విడిపోయి కలిసిన నిజమైన ప్రేమ జంటలకు ఈ సినిమా అంకితమంటూ చివరగా సినిమా ముగింపులో దర్శకుడు చెప్పే మాటకు యువకులు చప్పట్లు కొట్టడం సినిమాకు వారిచ్చిన సిన్సియర్ అభినందనలుగా చెప్పుకోవచ్చు.

చివరగా తెలంగాణ ఏర్పాటు తర్వాత  వచ్చిన పలు సినిమాల్లో తెలంగాణ యాస, భాషలకు ప్రాధాన్యత పెరిగింది. ‘పెళ్లిచూపులు’, ‘ఫిదా’ కోవలోనే ఈ సినిమాలోనూ తెలంగాణ మాండలలికం( కనీసం గతంలో మాదిరి ఉండే రెండు జిల్లాల తెలుగు బాషైతే వాడలేదు) వాడడం జరిగింది. కుల పిచ్చి, హీరోల పేరు చెప్పి కాయలమ్ముకునే పిచ్చి డైరెక్టర్లు  ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఇవేవి లేకుండా కేవలం తమ టాలెంట్ పైన నమ్మకం ఉండి, ఇలాంటి విభిన్నమైన సినిమాలు తీయగలిగే సత్తా కచ్చితంగా తెలంగాణ వారికే ఉందని చెప్పేంత దైర్యం కలిగింది.

-అయాన్ రాజన్న