మహానుభావుడితో ’అర్జున్ రెడ్డి’ డైరెక్టర్..! - MicTv.in - Telugu News
mictv telugu

మహానుభావుడితో ’అర్జున్ రెడ్డి’ డైరెక్టర్..!

September 2, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. మొదటి సినిమాతోనే బంపర్ హిట్టు కొట్టి టాప్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయారు. ఒక్క సినిమా హిట్టైతే చాలు బెల్లం చుట్టు ఈగల లెక్క, ఇండ్రస్టీ అంతా వాళ్ల చుట్టే చక్కర్లు కొట్టడం సహజం. అయితే తన తరువాత సినిమాను హీరో శర్వానంద్ తో చేయనున్నట్టు సందీప్ రెడ్డి కన్ఫమ్ చేశారు. నిజానికి తన తొలి సినిమాను శర్వానంద్ తోనే చేయాలనున్నాడు. అర్జున్ రెడ్డి కథను  మొదట శర్వానంద్ కే వినిపించాడు.

ఎందుకో తెలీదు కానీ ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. దీంతో విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి తీయడం, అది పెద్ద హిట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. రెండో సినిమా కథను శర్వానంద్ కు వినిపించాడట. శర్వానంద్ కు ఆ కథ నచ్చడంతో త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ’అర్జున్ రెడ్డి’ సినిమా మీద పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాగే అడ్డుకుంటే దేశం విడిచిపోయి హాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటా అని ప్రకటించిన సందీప్ రెడ్డి, మరి శర్వానంద్ సినిమాను రొటీన్ గా తెరకెక్కిస్తాడా లేక ’అర్జున్ రెడ్డి’ లాగే వివాదాస్పదమైన సినిమాగా తెరకెక్కిస్తాడా చూడాలి మరి.