‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి ఇంట్లో విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి ఇంట్లో విషాదం

August 22, 2019

sandeep reddy.

బ్లాక్ బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంట్లో కోలుకోలేని విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సుజాత ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూశారు. వరంగల్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు నటులు, సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళి అర్పిస్తున్నారు. 

విజయ్ దేవరకొండ, షాలినీ పాండేలతో సందీప్ రెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో అటు విజయ్, ఇటు సందీప్ కెరీర్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేయగా సందీపే దర్శకత్వం వహించి బాలీవుడ్ లోనూ పేరు సంపాదించుకున్నారు. ఆయనతో చిత్రాలు తీయడానికి నిర్మాతలు, నటులు క్యూ కడుతున్నారు. కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. కబీర్ సింగ్ బాలీవుడ్ లో రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఇదివరకు రూ. 5 కోట్ల పారితోషికంతో సరిపెట్టుకున్న షాహిద్ కపూర్ కొత్త చిత్రాలకు రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు.