మేకప్ మేన్ కొడుకే అర్జున్ రెడ్డి కెమెరామెన్ ! - MicTv.in - Telugu News
mictv telugu

మేకప్ మేన్ కొడుకే అర్జున్ రెడ్డి కెమెరామెన్ !

August 28, 2017

ఒక సినిమా హిట్టయితే డైరెక్టర్ తో సహా దానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. వాళ్ళక్కూడా ఒక మంచి ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా హ్యాప్పీగా వుంటుంది.

అర్జున్ రెడ్డి సినిమా విషయంలో కూడా ఇప్పుడు అందరి దృష్టీ దానికెవరు టెక్నీషియన్స్ పని చేసారని చూస్తున్నారు. ఈ సినిమాకు హీరో, డైరెక్టర్ తర్వాత అంత పేరు ఎక్కువగా వస్తోంది రాజుతోటకు.

రాజుతోట అర్జున్ రెడ్డి సినిమాకు సింగిల్ కార్డ్ డిఓపి. ఈ సినిమాలోని ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుందంటున్నారు. డైరెక్టర్ – కెమెరామెన్ రాపో బాగా కుదరడం వల్లే సినిమాకి జాన్ వచ్చింది. డైరెక్టర్ థాట్స్ ను క్యాప్చర్ చేసేవాడే అసలైన డిఓపి. అందుకు పక్కా నిదర్శనం రాజుతోట.

ఇతని కెరియర్ పదేళ్ళ క్రితం స్టార్ట్ అయింది. తనకు సినిమా నేపథ్యం వుంది. వాళ్ళ నాన్న మేకప్ మేన్. ఆ మేకప్ మేన్ కొడుకే ఇప్పుడు ఒక సక్సెస్ ఫుల్ సినిమాకు కెమెరామెన్. తన కెరియర్ సీనియర్ కెమెరామెన్ సురేందర్ రెడ్డి దగ్గర అసిస్టెంటుగా స్టార్టయ్యింది. ఆ తర్వాత మోహన కృష్ణ దగ్గర దాదాపు పది బాలీవుడ్ సిన్మాలకు అసిస్టెంటుగా చేసాడు. అలా ముంబయిలో ఐదారేళ్ళు వున్నాడు.

 

అతను రెండో కెమెరా ఆపరేటర్ గా ఇష్కియా, రుద్రాక్ష్, ట్యాంగో చాప్లి, డాడీ కూల్, లూట్, ఐయామ్ కలామ్, ఆర్. రాజ్ కుమార్, దో లబ్జోంకి కహానీ, ఫోర్స్ 2 తదితర సినిమాలకు పని చేసాడు. ఆ ఎక్స్ పీరియన్స్ అంతా మనకు అర్జున్ రెడ్డి ఫ్రేమ్ ఫ్రేమ్ లో కన్పిస్తుంది. తను పుట్టి పెరిగింది సూర్యాపేట జిల్లాలో. తను డిఓపిగా చేసిన ఫస్ట్ ఫిల్మే హిట్టవడంతో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయట. ప్రస్తుతం నిర్మాణ దశలో వున్న ‘ నీదీ నాదీ ఒకే కథ ‘ సినిమాకు డిఓపిగా చేస్తున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమా కూడా తనకు మంచి బ్రేకిస్తుందంటున్నాడు.

అర్జున్ రెడ్డి స్ర్కిప్టు వింటున్నప్పుడే ఈ సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందని బిలీవ్ చేసాడట. అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తనకు కథ చెప్పిన విధానం నచ్చిందట. చేస్తే ఇంత మంచి ట్యాలెంటెడ్ డైరెక్టర్ దగ్గరే చెయ్యాలని అప్పుడే డిసైడయ్యాడట. సినిమాను ఒప్పుకున్నాక వన్ ఇయర్ బాగా కష్టపడి ఎక్కడా, ఏ సీన్ లోనూ కాంప్రమైజ్ కాకుండా చేసారట. ముఖ్యంగా ఈ సిన్మాలో హోళీ సీన్ తనకు బాగా

నచ్చిందంటున్నాడు రాజుతోట. ఒక ఫుల్ డేలో ఆ సింగిల్ షాట్ ను చిత్రీకరించారట. స్ర్కిప్టుకు తగ్గట్టు ఏఏ లొకేషన్లు కావాలో ఆ లొకేషన్లలోనే సినిమా షూటింగ్ ఫినిష్ చేసారట. అర్జున్ రెడ్డి డిఓపిగా తనకు డెబ్యూ. అదీ ఇంత పెద్ద హిట్టవడంతో ఓ పక్క ఆనందం మరో పక్క బాధగానూ వుందంటున్నాడు.
ఎందుకంటే తన సక్సెస్ ను చూడ్డానికి కన్నతండ్రి లేడని ? తను ఈ సినిమాను ఒప్పుకున్న వన్ మంత్ కే తన తండ్రి చనిపోయాడట. తన సక్సెస్ ను చూసి నాన్నెంతో సంతోషించేవాడంటున్నాడు రాజుతోట.
ఏదేమైనా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి సినిమాలో తనూ ఒక భాగమైనందుకు కెమెరామెన్ రాజుతోటకు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెబుదామా.