‘అర్జున్ రెడ్డి’ మరో రికార్డు..  - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’ మరో రికార్డు.. 

August 29, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఏముంటేనేం.. దీని పుణ్యమా అని  అలనాటి అందాల నటి కాంచన మళ్లీ  వెండితైరపైకొచ్చింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా హల్ చల్ చేసి తర్వాత వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులతో చితికిపోయిన కాంచనను మళ్లీ మన ముందు నిలబెట్టిన రికార్డును సొంతు చేసుకున్నాడు అర్జున్ రెడ్డి. ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న కాంచనతో ఏ సర్టిఫికెట్ చిత్రం ద్వారా మళ్లీ తెరంగేట్రం చేయించడం కూడా అర్జున్ రెడ్డి ఘనతే..

ఈ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్ ఆరంభించిన 77 ఏడేళ్ల కాంచన విజయ్ దేవరకొండకు నానమ్మ గా నటించారు.  తన అందచందాలతో, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను  చేసిన ఒకప్పటి టాప్ హీరోయిన్ ఆమె. 1985లో వచ్చిన ‘శ్రీ దత్తదర్శనం’ తర్వాత పూర్తిగా తెరమరుగయ్యారు. అర్జున్ రెడ్డి సినిమాలో నటించడానికి మొదట కాంచన ఒప్పుకోలేదట. ఆ క్యారెక్టర్ కున్న ప్రాధాన్యతను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వివరించి… మీరే నటించాలని పట్టుబట్టి ఒప్పించారట. ‘అర్జున్ రెడ్డి’కి నానమ్మ పాత్రలో కాంచన చాలా సహజంగా  ఒదిగిపోయారు. ప్రస్తుతం కాంచన  బెంగుళూరులో ఉంటూ  దేవాలయాలను శుభ్రంచేస్తూ, ఓ వైపు సామాజిక సేవలో, మరోవైపు దైవ చింతనలో కాలం గడుపుతూ తన జీవితాన్ని సాగిస్తున్నారు.

1957లో  సినిమా కెరియర్ ని మొదలు పెట్టి తెలుగు, తమిళ, కన్నడం, మళయాలం, హిందీ ఇలా ఐదు భాషలలో హీరోయిన్ గా చేసి అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఎన్టీఆర్, ఏఆన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు ఇలా అందరితో చాలా సినిమాల్లో జోడీగా నటించింది. పవిత్ర బంధం, వీరాభిమన్యు, కళ్యాణ మండపం చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. 150 సినిమాల్లో నటించిన ట్రాక్ రికార్డ్ ఆమెది. దాదాపు 30 ఏండ్లు నటనకు దూరమైన కాంచన మళ్లీ ’అర్జున్ రెడ్డి’ సినిమాలో అర్జున్ నానమ్మగా నటించారు. అప్పటికి  ఇప్పటికి ఏ మాత్రం తీసిపోనీ నటనతో ఆకట్టుకున్నారు. ఇంకో ఆసక్తికర సంగతి కూడా ఉంది. రాజమౌళి ‘బాహుబలి2 ’లో కాంచనకు కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. కానీ ఆమె ఎందుకో ఆ ఆఫర్ ను తిరస్కరించారు.

 కాంచన జీవితంలో ఎన్నో సుడిగుండాలు..

సినీరంగంలో తనకంటూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కాంచన వ్యక్తిగత జీవితంలో లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నారు. స్వయంగా  తనతల్లిదండ్రుల నుంచే చాలా కష్టాల్ను ఎదుర్కొన్నారు. ఆమెకు తెలియకుండా తెల్లకాగితం పై సంతకం చేయించుకుని ఆస్తి మొత్తం వాళ్ల పేరు మీద రాయించుకున్నారు. అంతేకాదు తమ కూతురు

చెడిపోయిందంటూ కాంచనపై లేనిపోనీ ప్రచారాలు చేసి పెళ్లి కాకుండా చేశారు. కాంచన తన జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉన్నారు. ఎటు దిక్కుతోచని స్థితిలో ఒక గుడిలో ఉంటూ కాలం వెళ్లదీశారు. కోర్టులో తల్లిదండ్రులకు వ్యతిరేకగా కేసు వేసి సుదీర్ఘపోరాటం తర్వాత 15 కోట్ల ఆస్తిని కాంచన దక్కించుకోగలిగారు. 15 కోట్ల ఆస్తిని  కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా రాసిచ్చేశారు. తర్వాత సాధారణ జీవితం గడుపుతూ…దైవ చింతనలో నిమగ్నమయ్యారు.