తండ్రినే బెదిరించిన ‘అర్జున్ రెడ్డి’ లవర్! - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రినే బెదిరించిన ‘అర్జున్ రెడ్డి’ లవర్!

September 1, 2017

‘అర్జున్ రెడ్డి’ కథానాయిక ప్రీతి  ’ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్’ దాకా ఎంతో అమాయకంగా కనిపిస్తుంది. కాలేజీ సీన్స్ చూస్తుంటే అసలు ఈ పిల్లకు నోట్లో నాలుక లేదా అనే డౌట్ వస్తుంది.కానీ ఈ ప్రీతి పాత్ర పోషించిన శాలినీ పాండే మాత్రం బయట మహా ముదురట. తాను అనుకున్నది చేసేవరకు ఎవ్వరి మాటా వినదట. ఆఖరికి  ఇంట్లో వాళ్లమాట కూడా.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన శాలినీ పాండేకి ,చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. కానీ ఆమె తండ్రికి మాత్రం ఆమె సినిమాలు చేయడం అస్సలు ఇష్టంలేదు. బుద్ధిగా చదువుకొని జాబ్ చెయ్యమని శాలిని తండ్రి చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు  అయినా సరే తండ్రి మాటలు లెక్కచెయ్యకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది కుర్రది. . తండ్రి వద్దని అగ్గిమీద గుగ్గిలపైపోయాడు.. కానీ ఈమె కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.  ఏకంగా ఆయనపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానని  బెదిరించింది.  దీంతో తల్లిదండ్రులు తనతో మాట్లాడటం మానేశారని.. అయినా అవకాశాల కోసం వేట ఆపలేదని శాలిని చెప్పింది.  చివరకు ఫ్రెండ్స్ సాయంతో ’అర్జున్‌రెడ్డి’ సినిమాలో అవకాశం పొందానని ఓ  ఇంటర్వూలో వెల్లడించింది.  తండ్రి మాటను లెక్క చెయ్యని ఉత్తమ కూతురు అని ఈ విషయం తెల్సినోళ్లందరు శాలిని విమర్శిస్తున్నారు.