ఎవరీ ‘అర్జున్ రెడ్డి’ షాలిని..!  - MicTv.in - Telugu News
mictv telugu

 ఎవరీ ‘అర్జున్ రెడ్డి’ షాలిని..! 

August 28, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అర్జున్ లవర్ గా చాలా నేచురల్ గా నటించిన ప్రీతి అసలు పేరు షాలిని పాండే. ఆమె స్వంత ఊరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్. హీరోయిన్ గా ఆమెకు ’అర్జున్ రెడ్డి’ మొదటి సినిమానే అయినా నటనలో  మాత్రం ఇంతకు ముందే థియేటర్ ఆర్టిస్ట్. చాలా నాటకాల్లో నటించి సత్తా చాటింది.  ఇంజనీరింగ్ చదువుతూనే  థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. గత ఏడాది సెట్ ఇండియా చానల్ లో వచ్చిన ‘ మన్ మే విశ్వాస్ హై’ టీవీ షో ఎపిసోడ్లలో నటించింది.  అలా తన ఫొటోలను చూసిన “అర్జున్ రెడ్డి” డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు.

షాలిని తండ్రికి మాత్రం ఆమె హీరోయిన్ కావడం అస్సలు ఇష్టం లేదట. అర్జున్ రెడ్డి సినిమాలో కూడా నటించొద్దన్నాడట. తన కూతురిని మంచి ఇంజనీర్ గా చూడాలని ఆయన ఆశ పడ్డారు. కానీ షాలినికి మాత్రం చిన్నప్పట్టినుండి నటన మీదే ఆసక్తి ఉండడంతో థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. కూతురి ఇంట్రెస్ట్ ని కాదనలేక ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్జున్ రెడ్డి సినిమాలో నటించానంటుంది షాలిని.

‘ డైరెక్టర్  సందీప్ రెడ్డి … అర్జున్ రెడ్డి స్టోరీ చెపుతున్నప్పుడే  నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఉన్నది లవర్ పాత్ర. లిప్ లాక్ అంటే అదొక ఎమోషన్.. లవర్స్ మధ్య ఆ ఎమోషన్ పండాలంటే అవన్నీ తప్పనిసరి. పాత్రకు న్యాయం చెయ్యడంకోసం అలా నటించాను.ఓ థియేటర్ ఆర్టిస్ట్ గా  సీన్ పండాలంటే ఎలా నటించాలో నాకు తెలుసు. అందుకే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నటించాను  మొదటి సినిమా ఇంతగా హిట్ కావడం చాలా సంతోషంగా ఉంది’  అని మురిసిపోతుంది షాలిని అలియాస్ ప్రీతి.

  1. a. She also has acted as lead in Episode 21- Season 2 of the TV show Mann Mein Vishwaas Hain which aired on SETindia Channel in 2016.[1]

Filmography[edit]