‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ షాలిని పాండే అలియాస్ ప్రీతి ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు షాలిని వెళ్లింది. షాప్ ఓపెనింగ్ లో చురుగ్గా పాల్గొన్న షాలిని..ఆ తర్వాత షాపు వాళ్లు ఏర్పాటు చేసిన లైవ్ మ్యూజిక్ షోలో పాల్గొంది. అయితే అక్కడ ఒక్కసారిగా శాలిని కళ్లు తిరిగి పడిపోయిందట.
వెంటనే అప్రమత్తమైన షాపు సిబ్బంది ఆమెను దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రిలో స్ట్రైచర్ పై తీసుకెళ్లే సమయంలో శాలిని శరీరంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంచారు. హీరోయిన ముఖం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు గంటల చికిత్స, అబ్జర్వేషన్ తర్వాత శాలినిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారట.