‘అర్జున్ రెడ్డి’ ఇక 3 గంటల 11 నిమిషాలు... - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’ ఇక 3 గంటల 11 నిమిషాలు…

September 4, 2017

వివాదాలకు కేరాఫ్ గా  మారిన ‘అర్జున్ రెడ్డి’ మరికొన్ని సీన్స్ తో అలరించనున్నాడు..! ప్రస్తుతం మూడు గంటల ఒక నిమిషం నిడివితో విడుదలైన ఈ సినిమాకు మరో 10 నిమిషాల సీన్స్ ను జత చేయనున్నారు. వీటిని సెకండాఫ్ లో చూపుతారు. సోమవారం నుంచి ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్య కూడా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో మొత్తం నిడివి 3 గంటల 11 నిమిషాలు కానుంది.  సెకండాఫ్ ను బాగా సాగదీశారన్న విమర్శలు వస్తున్నా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ఆ భాగాన్ని అదనపు సీన్లతో మరింత పెంచడంపై సినీవర్గాలు విస్తుపోతున్నాయి. అయితే కాన్ఫిడెన్స్ తోనే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే హిట్లయి మంచి కలెక్షన్లు వసూలు చేసిన అర్జున్ రెడ్డి మూవీ అదనపు సీన్లతో కొత్త ప్రేక్షకులతోపాటు, ఇదివరకే సినిమా చూసిన వారినీ థియేటర్లు రప్పిస్తుందో లేదో చూడాలి.