అర్జున్‌రెడ్డి  దారిలో రంగస్థలం.. ఓపిక ఉంటుందా? - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్‌రెడ్డి  దారిలో రంగస్థలం.. ఓపిక ఉంటుందా?

March 28, 2018

హాలీవుడ్ సినిమాలు గంట, గంటన్నరకే పూర్తవుతాయి. కథకన్నా కథనానికి, కళ్లుచెదిరే సీన్లకు ప్రాధన్యామిస్తాయి. టాలీవుడ్ సినిమాలు కూడా ఆ దారిలో నడుస్తున్నాయి. రెండుగంటలకు మించి తీయడం లేదు. అయితే విజయ్ దేవరకొండ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసింది. మూడుగంటల నిడివితో ముందుకొచ్చి, బోర్ కొట్టించకుండా ఆకట్టుకుంది. రామ్ చరణ్ తాజా చిత్రం ‘రంగస్థలం’ కూడా ఒక నిమిషం తక్కువ మూడు గంటల నిడివితో ముందుకు రానుంది. 179 నిమిషాలపాటు సాగే ఈ మూవీని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ బాట పట్టించడానికి ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.సినిమా ఆకట్టుకునేలా ఉంటే నిడివితో సంబంధముండదు. పైగా రంగస్థలంలో సమంత ఉండడం, 1985 నాటి కథ కావడం వంటి అదనపు అంశాలు కలిసివచ్చేవే. బెన్‌హర్ వంటి హాలీవుడ్ క్లాసిక్స్ కూడా గంటల తరబడి సాగుతాయి. తెలుగులోకి వస్తే లవకుశ, దానవీరశూరకర్ణ వంటి సినిమాలు కూడా నిడివి ఎక్కువగా ఉన్నా, కథాబలం, నటినటుల సత్తా తోడుకవాడంతో ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నాయి.