వంగా కాన్ఫిడెన్స్ కు సలాం..! - MicTv.in - Telugu News
mictv telugu

వంగా కాన్ఫిడెన్స్ కు సలాం..!

August 30, 2017

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘ అర్జున్ రెడ్డి ’ హవా మస్తు నడుస్తున్నది. అరె ఏమన్న యాక్టింగ్ చేసిండా విజయ్ దేవరకొండ అని కొందరు, ఆయిన దోస్తు శివ గూడ మస్తు చేసిండని ఇంకొందరు, లేదు లేదు.. షాలిని గూడ సూపర్ చేసిందని మరికొంత మంది అంటున్నరు. అయితే దునియా మొత్తం అసలు ఈ సిన్మాను చెక్కిన శిల్పి సూపరెహె అంటున్నరు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తోపు దర్శకుడు అంటున్నరు. ఇంకా చెప్పాలంటే తెలుగు సిన్మా ఇండస్ట్రీకు కొత్త వేవ్ ను సూపెట్టిన పెద్దన్న అంటున్నరు. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళిలు గూడా ఈ సినిమాను మెచ్చుకుంటున్నరు.

అంతే కదా ఏ సిన్మా హిట్టయినా, ఫట్టయినా ముందు డైరెక్టర్ పేరునే ముందరేస్కుంటరు. ఇప్పుడు ఎక్కడ చూసినా సందీప్ రెడ్డి వంగా పేరే ఇనవడుతున్నది. నెక్ట్స్ సిన్మా కోసం ఆయినింటి ముంగట క్యూలు కడుతున్నరు హీరోలు, ప్రొడ్యూసర్లు. ‘ ఒక పదేండ్ల తర్వాత రావాల్సిన సీన్మ ’ అని అంటున్నరు చూసినోళ్లంత. మరి గీ సీన్మ గింత బాగా రానీకి డైరెక్టర్ కృషి శానా వుంది. రెండు మూడేండ్లు ఈ కథ మీద మస్తు కసరత్తులు చేసిండు. కథ రాస్కునేటప్పుడే ఇది తప్పకుండ హిట్టైతదని నమ్ముకున్నడట.

ఇప్పుడు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ ఆయిన నమ్మకాన్ని నిజం చేసిందనే చెప్పుకోవాలె. తన కాన్ఫిడెన్సును కూడా మెచ్చుకునాలె. మూడు గంటల పది నిమిషాల సిన్మా తీసి ప్రేక్షకులను కుర్సీలల్ల అస్సలు బోరు గాకుండ కూసుండవెట్టిన అతని కాన్ఫిడెన్సుకు జోహార్ అంటున్నరు విమర్శకులు. అంతేగదా ఏ సిన్మానైనా ముందు డైరెక్టరే తన పర్ సెప్షన్ నుంచే ముందుగాల్ల సూస్తడు. ఆ తర్వాత తెర మీద తన పర్ సెప్షన్ నుండే పర్ ఫెక్షన్ ను రాబట్టుకుంటడు.

సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయినది వరంగల్ జిల్లా. ఫిజియోథెరపీ చదువుకున్నడు. డాక్టర్ అయిదామని డైరెక్టర్ అయిండు. అందుకోసం సిడ్నీ పోయి అక్కడ ఫిలిం మేకింగ్ లో మాస్టర్స్ చేసిండు. తర్వాత తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన ‘కేడీ ’ సిన్మాకు అసిస్టెంటు డైరెక్టర్ గా చేసిండు. ప్రతీ శాఖ మీద మంచి గ్రిప్పున్నోడు గనకే అర్జున్ రెడ్డి సిన్మాలో ఇంచించు తన మార్కు కనవడుతది.

ఈ సిన్మాకు ఆయన అన్ననే నిర్మాత. ‘మనలో ట్యాలెంటు వుంటే కాన్ఫిడెన్సు అదే వస్తుంది. దాన్ని మనుసులో గట్టిగా పెట్టుకుంటే ఎవరి ముందూ తలకాయ వంచాల్సిన అవసరం వుండదని’ స్టేజీ మీద విజయ్ దేవరకొండ అన్నడు. నిజమే పేరులోనే

వంగా ’ అని పెట్టుకున్న ఈ డైరెక్టర్ కాన్ఫిడెన్సుకు సలామ్ చెయ్యాల్సిందే.