‘అర్జున్ రెడ్డి’ మూవీతో దుమ్మురేపిన టాలీవుడ్ హీరో అర్జున్ రెడ్డి మల్టీ టాలెంటెడ్ పర్సన్! ‘రౌడీ’ బ్రాండ్ పేరుతో బట్టల బిజినెస్ చేస్తున్న విజయ్ తాజాగా మరో వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. రెంట్ బైక్స్, స్కూటర్లను నడిపే సంస్థలో పెట్టుబడులు పెట్టేశాడు. హైదరాబాద్కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ పై జరిగిన సదస్సులో అతడు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. కాలుష్య రహిత విద్యుత్ వాహనాల పర్యావరణానికి మంచి జరుగుతుందని, భవిష్యత్తు వాటిదేనని అన్నాడు. ఈ వాహనాలకు భారీ డిమాండ్ ఉంటుంది కనుకే తాను పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. వాల్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ వచ్చే ఏడాది జనవరి నుంచి హైదరాబాద్లో తన వాహనాలను అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం నగరంలో బౌన్స్ కంపెనీ ద్విచక్ర వాహనాలు ఉన్న సంగతి తెలిసిందే. వాల్స్ అండ్ వోల్ట్స్ వాహనాలకు కూడా చార్జీలు చెల్లించి వాడుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ విధానాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను తయార చేసే కంపెనీలకు అందులు సబ్సిడీలను, పన్ను రాయితీలను ప్రకటించారు. ‘