విజయ్ దేవరకొండ ఇక ‘ట్యాక్సీవాలా’ - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ దేవరకొండ ఇక ‘ట్యాక్సీవాలా’

November 29, 2017

అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండకి ఆఫర్లపైన ఆఫర్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు, దర్శకులతోపాటు సినిమా భామలు కూడా అతనితో కలసి చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే విజయ్ మాత్రం ఆచితూచే అంగీకరిస్తున్నాడు.

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ తీస్తున్న చిత్రంలో అతడు ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. మూవీలో విజయ్ ఓ క్యాబ్ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. కథ కూడా క్యాబ్ చుట్టూనే తిరుగుతుందంట. అందుకే ఈ సినిమాకి ‘టాక్సీవాలా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విజయ్ క్యాబ్ నడుపుతున్న వీడియో క్లిప్ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ మూవీ పక్కాగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారు. విజయ్ పక్కన ప్రియాంకా జ్వాలాకర్ జోడీకట్టింది. ఈ మూవీతోపాటు విజయ్ చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. రెమ్యూనరేషన్ కాస్త తగ్గిస్తే చిన్న నిర్మాతలు కూడా అతనితో సినిమాలకు రెడీగా ఉన్నారు.