తనను హీరో అర్జున్ లైంగికంగా వేధించాడంటూ ‘మీటూ’ ఉద్యమం ద్వారా మందుకొచ్చి చెబుతున్నానని నటి శ్రుతీ హరిహరన్ చేసిన వ్యాఖ్యలపై అర్జున్ స్పందించారు. తనపై వచ్చే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. తాను ఎప్పుడు హీరోయిన్లను వేధించలేదన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ‘మీటూ’ ఉద్యమం బలహీన పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతోందని అనుమానం ఉందన్నారు. ఈ విషయంతో తాను కూడా పోరాడతానని తెలిపారు. శృతి హరిహరన్తో తాను ఒకే ఒక్క సినిమాలో నటించానని చెప్పిన ఆయన, ఆ సినిమా షూటింగ్ సమయంలో తాము ఒక్కసారి కూడా ఒంటరిగా కలుసుకోలేదని స్పష్టం చేశారు.యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శృతి హరిహరన్ ఆరోపణలు గుప్పించింది. ‘విస్మయ’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్న సమయంలో తనను అర్జున్ హత్తుకున్నాడని శృతి ఆరోపించింది. ఓ రొమాంటిక్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా… చేతులను తన వీపుపై ఉంచి గట్టిగా హత్తుకుని, ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడని ఆమె తెలిపింది. ఒక నటి అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం దారుణమని చెప్పింది. ఆ ఘటనతో తాను షాక్కు గురయ్యాను అని పేస్ బుక్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.