ఏం మాట్లాడుతున్నవ్ రా.. ‘అర్జున్ రెడ్డి’ - MicTv.in - Telugu News
mictv telugu

ఏం మాట్లాడుతున్నవ్ రా.. ‘అర్జున్ రెడ్డి’

August 22, 2017

 

‘అర్జున్ రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ తొలి ఆట పడకముందే మహ పేట్రేగిపోతున్నాడు. ఏ సర్టిఫికెట్ సాధించుకున్న ఈ సినిమా హీరో నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వేదికలపై పచ్చి బూతులు మాట్లాడేస్తున్నాడు. ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డుపై భయంకరంగా అక్కసు వెళ్లగక్కుతున్నాడు.

 

‘సెన్సార్ ఓ తిక్కమేళం.. ’ అని ఈ కుర్ర హీరో తిట్లకు లంఘించుకున్నాడు. సినిమాలోని ‘‘ఏం మాట్లాడుతున్నవ్ రా.. ( )’ అనే డైలాగులోని చివరి పదానికి సెన్సార్ బోర్డు కత్తెరేసి మ్యూట్ చేసింది. ఈ బూతు పదాన్ని తీసేసినందుకు విజయ్ కి ఎక్కడో బాగా కాలింది. సినిమాకు వచ్చే వాళ్లు.. ఆ డైలాగ్ వచ్చే సమయంలో మ్యూట్ చేసిన పదాన్ని గట్టిగా పలకాలని ఈ హీరో కోరాడు. అంటే సెన్సార్ బోర్డు కట్ చేసిన మాటను ప్రేక్షకుల నోటితో పలికించి కసితీర్చుకోవాలన్నది ఈ హీరో ఎత్తుగడ. అయినా ఇతగాడు ఏం చెబితే అది చేయడానికి ప్రేక్షకులు బూతు  గొర్రెలేమీ కాదు కదా.

విజయ్ నోటి దురుసుకు మరో ఉదాహరణ వి. హనుమంతరావుపై చేసిన కామెంట్లు. ఈ సినిమా లిప్ లాక్ పోస్టర్ ను చించేసిన సదరు కాంగ్రెస్ పెద్దాయనపై విజయ్ సటైర్లు వేశారు. చిల్ తాతయ్యా అని ట్వీట్ చేసిన ఇతగాడు.. ‘పోస్టర్ ను చూసే తట్టుకోలేకపోతే రేపు సినిమాను చూసి ఏ తట్టుకుంటాడు తాతయ్య?’’ అని అన్నాడు.

ఏ సర్టిఫికెట్ సినిమాలో ఏముంటుందో అందరికీ తెలిసిందే. ఆడవాళ్లు, పిల్లలు కాస్త అసుంటా జరిగిపోాతారు. మరి ఏ ధైర్యం చూసుకుని విజయ్ రెచ్చిపోతున్నాడో అర్జున్ రెడ్డికే తెలియాలి.