‘అర్జున్ రెడ్డి’ లిప్ లాక్ పోస్టర్ ను చించేసిన వీహెచ్  - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’ లిప్ లాక్ పోస్టర్ ను చించేసిన వీహెచ్ 

August 21, 2017

ఓ ఆర్టీసీ బస్సుపై అంటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ అశ్లీలంగాంగా ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు దాన్ని పరాపరా చించిపారేశారు.

ఆయన ఆదివారం గాంధీ భవన్ లో సమావేశానికి  హాజరై తిరిగి వెళ్తుండగా సదరు బస్సు కంటపడండి. ఆయన వెంటనే గమనించి బస్సును ఆపేవారు. కండెక్టర్ సాయంతో ఆ పోస్టర్ ను చించేశారు.

‘ఇలాంటి పోస్టర్లు యువతను తప్పుదారి పట్టిస్తాయి. యువత ప్రయాణించే బస్సులపై ఇలా ముద్దులు పెట్టుకుంటున్న పోస్టర్ ను అంటిచడం ఎంత వరకు సబబు?  తెలంగాణ ప్రభుత్వం వ్యాపార ప్రకటనతో వచ్చే ఆదాయం కోసం ఎంతకైనా తెగిస్తోంది’ అని వీహెచ్ మండిపడ్డారు. ఇకపై ఇలాంటి అసభ్యకర పోస్టర్లను బస్సులపైనేకాక మరెక్కడా అంటించడానికి అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.

దీనిపై ‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరో విజయ్ దేవకొండ స్పందిస్తూ.. ‘చిల్.. తాతయ్య.. ’ అని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు.

Thathayya, chill 🙂

Posted by Vijay Deverakonda on Sunday, 20 August 2017