హిందీ ‘అర్జున్ రెడ్డి’గా రణవీర్! - MicTv.in - Telugu News
mictv telugu

హిందీ ‘అర్జున్ రెడ్డి’గా రణవీర్!

September 9, 2017

తెలుగు సూపర్ డూపర్ హిట్ మూవీ‘అర్జున్ రెడ్డి’పై దేశంలోని ఇతర భాషా సినీ పరిశ్రమలు కూడా మనసు పారేసుకుంటున్నాయి. ఈ మూవీని హిందీలో తీయడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ ర్యాంబో రణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో అర్జున్ రెడ్డిగా కనిపించబోతున్నాడట. హీరోయిన్ గా ఎవరు చేస్తారనేది ఇంకా చెప్పలేదు. మరో వైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా  మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కథలను  మహేష్ భార్య నమ్రతకు వినిపించినట్టు  సందీప్ రెడ్డి స్వయంగా చెప్పాడు. మరి మొదట బాలీవుడ్ లో ’అర్జున్ రెడ్డి’ ని తెరకెక్కిస్తాడా లేక మహేష్ తో సినిమా తీస్తాడా అనేది మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికైతే మొదటి సినిమా బంపర్ హిట్టు కావడంతో సందీప్ రెడ్డికి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి ,సందీప్ రెడ్డి కి  అదృష్టం ’అర్జున్ రెడ్డి’  రూపంలో వచ్చిందన్న మాట.