విశ్వక్‌సేన్ జోడీగా అర్జున్ కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

విశ్వక్‌సేన్ జోడీగా అర్జున్ కూతురు

May 18, 2022

తమిళ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ అంటే తెలియని దక్షిణాది సినీ ప్రియులు ఉండరు. ప్రస్తుతం అర్జున్ కూతురు ఐశ్వర్యకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే అర్జున్ తన కూతురు ఐశ్వర్యను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి, సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి తాజాగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విశ్వక్‌సేన్ హీరోగా, ఐశ్వర్య హీరోయిన్‌గా అర్జున్ తన సొంత బ్యానర్‌లో, సొంత డైరెక్షన్‌లో సినిమాను చేయడానికి భారీ ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇక, కోలీవుడ్‌ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటికే కమల హాసన్ కూతరు, శరత్ కుమార్ కూతరు హీరోయిన్స్‌గా నిలదొక్కుకున్నారు. ఈ క్రమంలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా కథానాయికగా పరిచయం కానుంది. ఇప్పటికే ఐశ్వర్య.. తమిళ, కన్నడ భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి, లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలో విశ్వక్‌సేన్ జోడిగా ఐశ్వర్య త్వరలోనే నటించనుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.