చెడపకురా చెడేవు.. దుప్పిని కాల్చి వేటగాడు బలి - MicTv.in - Telugu News
mictv telugu

చెడపకురా చెడేవు.. దుప్పిని కాల్చి వేటగాడు బలి

October 27, 2019

Arkansas hunter Nomore after deer he shot got back up and attacked him, officials say

అతను సరదాగా కొండప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ దుప్పి కనిపించింది. ఇంకే వెంట తెచ్చుకున్న గన్‌తో దానిని షూట్ చేసి చంపాడు. ఆ తర్వాత అది చచ్చిపోయిందా లేదా అని దాని దగ్గరికి వెళ్లి చూశాడు. విచిత్రంగా అది ప్రాణాలతోనే ఉంది. లేచి తనను కాల్చిన అతనిమీద దాడికి పాల్పడింది. దాని దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ వేటగాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాకు చెందిన అలెగ్జాండర్ మంగళవారం ఓజార్క్ పర్వతాలలో ఉన్న యెల్విల్లే సమీపంలో వేటకు వెళ్లాడు. అప్పుడు ఆయనకు ఓ దుప్పి కనిపించింది. వెంటనే దానిని తన వెంట తెచ్చుకున్న గన్‌తో కాల్చాడు. దీంతో అది కిందపడిపోయింది. అది చచ్చిపోయిందని భావించిన అతను దాని దగ్గరకు వెళ్లి చూశాడు.

అయితే చనిపోయినట్లు నటించిన ఆ దుప్పి ఒక్క ఉదుటున లేచి అలెగ్జాండర్‌పై ఒక్కసారిగా దాడికి పాల్పడింది. తీవ్రగాయాల పాలైన అతను ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టంట్ ఖర్మ అంటే ఇదేనని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చెడపకురా చెడేవు అని ఇందుకే అనుంటారని అంటున్నారు. నోరులేని జంతువులను వేటాడేవారికి ఇదొక నీతికథ.. వాటిని వేటాడటం అన్యాయం అని చెబుతున్నారు.