డాక్టర్‌కు సాయుధ బలగాలతో రక్షణ.. కారణం పెద్దదే - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్‌కు సాయుధ బలగాలతో రక్షణ.. కారణం పెద్దదే

August 14, 2020

Armed Guards Protect Doctor in Bihar

ప్రముఖులకు, రాజకీయ నాయకులకు సాయుధ బలగాలతో రక్షణ కల్పిస్తూ ఉంటారు. కానీ ఓ సాధారణ డాక్టర్‌కు బిహార్ ప్రభుత్వం ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటు చేసింది.  భాగల్ పూర్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉన్న కరోనా ఆస్పత్రిలో ఇది చోటు చేసుకుంది. డాక్టర్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట రక్షణ సిబ్బంది రావడం చూసి అంతా షాక్ అవుతున్నారు. అయితే దీనికి ఓ బలమైన  కారణం కూడా ఉంది. అక్కడ డాక్టర్‌పై రోగుల బంధువులు దాడి చేసే ప్రమాదం ఉందని ఈ విధమైన చర్యలు తీసుకోవడం విశేషం.

డాక్టర్ కుమార్ గౌరవ్   కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఆయన ఒక్కరే డాక్టర్ కావడంతో తరుచూ రోగుల బంధువు ఆసుపత్రిలోని ఐసీయూ వార్డు సహా అన్ని ప్రాంతాలకూ యదేచ్ఛగా  తిరిగేస్తున్నారు. ప్రశ్నిస్తే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వీటితో విసిగిపోయిన డాక్టర్ ఉన్నతాధికారులకు తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆ ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు ఇతర డాక్టర్లు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఉన్న ఒక్కడినే కాపాడుకుంటూ చికిత్స చేయించాలని అనుకున్నారు. వెంటనే సాయుధ బలగాలను కేటాయించారు. ఎవరూ అతనిపై దురుసుగా ప్రవర్తించకుండా వారు చూసుకుంటున్నారు. దీంతో ఆ డాక్టర్ స్వేచ్ఛగా తన పని తాను చేసుకుంటున్నాడు. ఇలా ఓ డాక్టర్‌ను అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పించి కాపాడుకుంటున్న విషయం ఆసక్తిగా మారింది.