ఆర్మీనియా-అజర్‌బైజాన్‌ల యుద్ధంలో దూరిన పాక్! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీనియా-అజర్‌బైజాన్‌ల యుద్ధంలో దూరిన పాక్!

October 2, 2020

Armenia Azerbaijan clash Pakistani fighters on ground .

భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసి, చైనాకు వత్తాసు పలుకుతున్న పాకిస్తాన్ తదుగునమ్మా అంటూ మరో గొడవలో తలదూర్చింది! ఆర్మీనియా, అజర్‌బైజాన్ దేశాల మధ్య ఐదు రోజులగా సాగుతున్న యుద్ధంలో పాక్ కూడా పోరాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అజర్‌బైజాన్ తరఫున పాక్ జవాన్లు తుపాకులు పుచ్చుకుని కొట్లాడుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. 

నాగోర్నో కారాబఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఈ యుద్ధం జరుగుతోంది. పాక్ అజర్‌బైజాన్ వైపు నిలబడి కొట్లాడుతున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆ వార్తలను తోసిపుచ్చింది. అదే సమయంలో నాగోర్నో కారాబఖ్‌పై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని చెప్పుకొచ్చింది. అజర్‌బైజాన్ ప్రజలపై ఆర్మీనియా బాంబు దాడులు చేయడం సరికాదని, వాటినే దాడులు ఆపాలని కోరింది. అర్మేనియాలోని క్రైస్తవులకు, అజర్‌బైజాన్‌లోని ముస్లింలకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న ఘర్షణ యద్ధరూపం సంతరించుకున్నాయి. మరోపక్క.. అజర్‌బైజాన్, ఆర్మీనియాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం కోరింది. యుద్ధం వల్ల శాంతికి విఘాతం కలుగుతుందని విదేశాంగ ప్రతినిధి అనురాగ్ కశ్యప్ ఆందోళ వ్యక్తం చేశారు.