టీవీ సౌండ్‌ ఎక్కువ పెట్టాడని హత్య చేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ సౌండ్‌ ఎక్కువ పెట్టాడని హత్య చేశాడు

February 21, 2020

Armoor tv sound issue

క్రమంగా మనుషుల్లో ఓపిక నశిస్తోంది. చిన్న చిన్న కారణాలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్ముర్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. టీవీ సౌండ్‌ ఎక్కువ పెట్టాడని సాత్‌పుతే గిర్మాజీ రాజేందర్‌(40)ను ఓ వ్యక్తి హత్య చేశాడు. గోల్‌బంగ్లాలో ఉంటున్న రాజేందర్‌ బుధవారం రాత్రి టీవి చూస్తున్నాడు. అతని ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి అదే సమయంలో భార్యతో గొడవ పడుతున్నాడు. 

కోపంతో ఉన్న బాలనర్సయ్య తన ఇంటి యజమాని రాజేందర్‌ను టీవీ సౌండ్‌ ఎందుకు ఎక్కువ పెట్టావని తలపై బలంగా కొట్టాడు. దీంతో రాజేందర్‌ కుప్పకూలి పడిపోయాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు.