సినీ ఇండస్ట్రీకి రక్షణశాఖ షాక్.. ఆర్మీపై సినిమాలు కష్టమే - MicTv.in - Telugu News
mictv telugu

సినీ ఇండస్ట్రీకి రక్షణశాఖ షాక్.. ఆర్మీపై సినిమాలు కష్టమే

August 2, 2020

Army Backdrop Movie  .

భారత సైన్యంపై అన్ని బాషల్లో సినిమాలు వచ్చాయి. చాలా వరకు వీటి నేపథ్యంలో వచ్చినవి హిట్ అయ్యాయి కూడా. దీంతో కొన్ని సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో ఆర్మీ సన్నివేశాలను చూపిస్తూ వచ్చారు. అయితే ఇక నుంచి అదేమి కుదరదు. ఆర్మీపై సినిమాలు తీయాలంటే రూల్స్ మరింత కఠినతరం చేశారు. ఇంతకు ముందులా ఇబ్బడిముబ్బడిగా తీసేస్తామంటే కుదరదని కేంద్ర రక్షణ శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించింది. సినిమా తీయాలనుకునే వారు వీటిని తప్పనిసరిగా పాటిస్తేనే అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. 

ఇప్పటి వరకు ఆర్మీపై వచ్చిన సినిమాల్లో సన్నివేశాలు దర్శకుడు తనకు కావాల్సిన రీతిలో మలుచుకునే వాడు. కానీ ఇక నుంచి ఏ భాషలోనైనా సైన్యం నేపథ్యంలో సినిమా  రావాలన్నా ముందుగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే. సినిమా కథను ముందుగా రక్షణశాఖకు చెప్పి ఒప్పించాలి. ఆ తర్వాత షూటింగ్ పూర్తైన వెంటనే విడుదల సమయంలో సినిమా చూపించాలి. అందులో ఏమి ఎలాంటి ఇబ్బంది లేదని సంతృప్తి చెందితేనే విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేస్తారు. దీంతో ఇక నుంచి ఆర్మీపై సినిమాలు తీయడం అంత తేలిక కాదని ఈ నిబంధనలతో తేలిపోయింది.