లద్దాఖ్ సరిహద్దులో పాక్ సైన్యం.. ఎదుర్కోడానికి రెడీ: రావత్  – MicTv.in – Telugu News
mictv telugu

లద్దాఖ్ సరిహద్దులో పాక్ సైన్యం.. ఎదుర్కోడానికి రెడీ: రావత్ 

August 13, 2019

Army..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని .. లద్దాఖ్  ప్రాంతంలోని వాస్తవాధీన రేఖకు ఆవల పాకిస్థాన్ సైన్యం క్షిపణులను మోహరించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. లద్దాఖ్‌లో పాక్ సైనిక మోహరింపుపై పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

 ‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. రాష్ట్రంలో సైనికులు ఎటువంటి ఆయుధాలనూ తీసుకెళ్లకుండా ప్రజల్లోకి వెళ్లి వారికి బక్రీద్ శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. సరిహద్దుల వద్ద ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వం సిద్ధంగా వుంది. సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలకు పాల్పడితే, సమర్థవంతంగా తిప్పికొడతాం. పాకిస్తాన్ సరిహద్దులకు మరింత సైన్యాన్ని చేర్చడం వెనుక వేరే ఉద్దేశమేమీ లేదు. ముందు జాగ్రత్త చర్యలుగానే సైన్యాన్ని తరలిస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు’ అని బిపిన్ రావత్ తెలిపారు.  1970-80 ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉండేదో, అదే ప్రశాంతత త్వరలోనే కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.