భారత్‌తో యుద్ధం.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్! - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌తో యుద్ధం.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్!

October 29, 2020

pilot

పాకిస్థాన్‌పై ఇండియా దాడి చేయబోతోందనే విషయం తెలియాగానే ఆ దేశ సైన్యాధ్యక్షుడు బజ్వా వణికిపోయారట. ఈ విషయాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాధిక్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలను పేల్చివేసిన సంగతి తెల్సిందే. ఆ మరుసటి రోజున పాక్ విమానాలు ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ యుద్ధ విమానంతో పాక్‌కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేశాడు. 

ఈ క్రమంలో అభినందన్ ప్రయాణిస్తున్న మిగ్ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. దీంతో అభినందన్ పాక్ ఆర్మీ అధికారులకు బందీగా దొరికిపోయాడు. అభినందన్‌ను తిరిగి తీసుకుని రావడానికి పాక్‌తో యుద్ధం చేయడానికైనా సిద్దమని భారత్ సంకేతాలు పంపింది. దీంతో పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖురేషి పార్లమెంట్ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి పాక్ ఆర్మీ జనరల్ బజ్వా కూడా హాజరయ్యారు. అప్పుడు అభినందన్‌ను వెంటనే వదిలేయాలని, లేదంటే భారత్ తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని, ఆరోజు రాత్రి 9 గంటలోగా భారత్ తమపై దాడికి దిగుతుందని ఖురేషి మీటింగ్‌లో చెప్పినట్టు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత అయాజ్ సాధిక్ తెలిపారు. ఖురేషి ఈ విషయం చెప్పిన వెంటనే ఆర్మీ జనరల్ బజ్వాకు చమట్లు పట్టాయని, కళ్ళు చేతులు వణికాయని సాధిక్ తెలిపారు. అందుకే అభినందన్‌ను వెంటనే ఇండియాకు అప్పగించారని తెలిపారు. సాధిక్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల్లో సంచలనం రేపుతున్నాయి.