తెలంగాణకు చెందిన వీరుసైనికుడు అమరుడయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని లద్దాఖ్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడడంతో కొమరం భీమ్ జిల్లాకు చెందిన మహమ్మద్ షాకిర్ అనే సైనికుడు చనిపోయాడు. ఆయన వయసు 35 ఏళ్లు. కాగజ్ నగర్‌కు చెందిన షాకిర్ విధి నిర్వహణలో ఉండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆర్మీ అధికారులు షాకిర్ కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. షాకిర్ మృతవార్తతో కాగజ్ నగర్¡లో విషాద ఛాయలు అలముకున్నాయి.