తమిళనాడులో దారుణం జరిగింది. కృష్ణగిరిలో డీఎంకే కార్పొరేటర్, అతని సహచరులు ఆర్మీ జవాన్ను దారుణంగా కొట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా జవాన్ సోదరుడు గాయపడ్డాడు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. లాన్స్ నాయక్ ఎం. ప్రభు (29) అనే వ్యక్తిని డీఎంకే కార్పొరేటర్ చిన్నస్వామి ఆయన అనుచరులు తీవ్రంగా కొట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు చూస్తే ఈనెల 8న చిన్నస్వామి ఇంటికి సమీపంలో వాటర్ ట్యాంక్ ఉంది. అక్కడ బట్టలు ఉతికే విషయంలో ఆర్మీ జవాన్ ప్రభుతో వాగ్వాదం జరిగింది.
DMK councillor among 7 arrested in TN for ‘killing Army man in row over water tank’@Akshayanath reports for ThePrinthttps://t.co/mBY6E9dUD1
— ThePrintIndia (@ThePrintIndia) February 15, 2023
గొడవ జరిగిన రోజు రాత్రే కార్పొరేటర్ చిన్నస్వామి తన అనుచరులతో కలిసి ప్రభు ఇంటి పైదాడికి దిగారు. ప్రభుతోపాటు అతని సోదరుడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అన్నదమ్ముళిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రభు చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడు. ప్రభు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుత కేసు నమోద చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కార్పొరేటర్ చిన్నస్వామి కుమారుడు రాజపాండి సహా ఆరుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చిన్నస్వామి గురించి పోలీసులు గాలిస్తున్నారు.