సరిహద్దుల్లో టెన్షన్.. పాక్ కాల్పుల్లో భారత జవాను మరణం - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దుల్లో టెన్షన్.. పాక్ కాల్పుల్లో భారత జవాను మరణం

June 5, 2020

Army Loss Personnel At Rajouri

భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు పాక్ సైన్యం కాల్పులు, మరో వైపు ముష్కరుల కదలికలతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. రాజౌరీ జిల్లాలో సుందర్ బనీ సెక్టార్ వద్ద  పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గురువారం రాత్రి  సైన్యంపై కాల్పులు జరపడంతో మన జవాన్ ఒకరు అమరుడయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆర్మీ పాక్‌కు ధీటుగా బదులు చెప్పింది. రాత్రంతా జరిగిన కాల్పులతో చివరకు పాక్ తోక ముడిచింది. 

ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం : 

మరోవైపు రాజౌరిలోని కాలకోటేలో ఉగ్ర కదలికలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అనువనువు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో గాలింపు మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచే భద్రతాదళాలు గస్తీని ముమ్మరం చేశాయి.  సరిహద్దుల గుండా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఉగ్రకదలికలపై నిఘా పెంచారు. తనిఖీలు ముమ్మరం చేసి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.