ఆర్మీ విమానం కూలి 250 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీ విమానం కూలి 250 మంది మృతి

April 11, 2018

సైన్యానికి చెందిన ఓ విమానం కుప్పకూలిపోవడంతో 250 మంది సైనికులు మృత్యవాత పడ్డారు. అల్జీరియా రాజధాని అల్జీర్స్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అల్జీర్స్ దగ్గర్లోని బౌఫారిక్ మిలిటరీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కాసేపటికే కూలిపోయింది. అల్జీరియా పశ్చమాది నగరం టుండుర్ఫ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆలివ్ చెట్ల మధ్య కూలిపోయాక మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి.మృతుల్లో వెస్టరన్ సహారా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న వెస్టరన్ సహారన్ పోలిసారియోకు చెందిన 26 మంది మిలిటెంట్లు కూడా ఉన్నారు. వీరికి అల్జీరియా సైన్యం మద్దతిస్తోంది. 2014లో అల్జీరియా వాయుసేన విమానం కూలడంతో 77 మంది చనిపోయారు.