ఇండియన్ ఆర్మీలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీలోని హెచ్‌క్యూ 22 కింద గ్రూప్ సి పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్మీలో రిక్రూట్ చేయనున్న గ్రూప్ సి పోస్టులలో మొత్తం 135 ఎంటిఎస్ (సఫాయివాలా), ఎంటిఎస్ (మెసెంజర్), మెస్ వెయిటర్, బార్బర్, వాషర్‌మన్, మషల్చి, కుక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు నిర్ణీత ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000 – రూ.63,200 నెలవారీ జీతం ఉంటుంది.
ఆఫ్‌లైన్ మోడ్‌లో అప్లికేషన్:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌తో పాటు ప్రచురించబడే దరఖాస్తు ఫారమ్ ద్వారా ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ ఫారమ్‌ను పూర్తిగా నింపి, కావాల్సిన పత్రాలను జోడించి 21 రోజులలోపు సమర్పించాలి. గ్రూప్ కమాండర్, HQ 22, మూవ్‌మెంట్ కంట్రోల్ గ్రూప్, పిన్-900328, C/o 99 APO. అభ్యర్థులు దరఖాస్తు కవరుపై దరఖాస్తు చేసిన పోస్టు పేరు పై చిరునామకు పంపించాలి.
అర్హత, ఎంపిక ప్రక్రియ
ఆర్మీ హెచ్‌క్యూ 22 కింద ప్రకటించబడిన గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థులు ఖాళీలకు సంబంధించిన ట్రేడ్‌లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. నిర్ణీత కటాఫ్ తేదీ ప్రకారం అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 25 సంవత్సరాలకు మించకూడదు. అభ్యర్థులను రాత పరీక్ష, ప్రాక్టికల్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోండి.