అరుస్తూ వస్తున్నాడు సరికొత్తగా... - MicTv.in - Telugu News
mictv telugu

అరుస్తూ వస్తున్నాడు సరికొత్తగా…

June 8, 2017

ఆయనవి అరుపులు కావు మెరుపులే ఈదేశాన్ని ఎవరు ఏమన్నా సహించడు.గొంతు చించుకుంటాడు. పాకిస్థాన్ కి మైగ్రేన్ (తలనొప్పి)ఆయన,ఈదేశ రాజ్జాంగ రక్షకుడనని ఆయన ఫీలింగ్(అయితే ఆయన ఒక టీవీ జర్నలిస్ట్)ఇప్పుడు ఆయన సరికొత్త ప్రోగ్రాంతో మనముందుకు వస్తుండు,దేశభక్తిని గుండెలనిండా నింపుకొని భక్తులకు మంచి సమోసాలు అందించడానికి వస్తుండు.

నేషన్వాంట్స్ టునో అనే ఆయన ఊతపదం అందర్కి తెలిసిందే,ఇప్పుడు మీకర్ధమైఉంటుంది ఎవరి గురించి చెబుతున్నామో…మీరనుకుంటున్నట్టే మేం చెప్పబోయేది అర్నాబ్ గోస్వామి గురించే. కొంచెం ఇంట్రో ఎక్కువైనా తప్పదు.

ఈమద్యకాలంలో ఆర్నబ్ ప్రారంభించిన ఇంగ్లీష్ న్యూస్ చానల్ రిపబ్లిక్  లాంచింగ్ తోటే మంచి రేటింగ్స్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే,అయితే రిపబ్లిక్ టీవీలో నేషన్ వాంట్స్ టు నో పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆర్నబ్ గోస్వామి,అయితే ఇది టాక్ షో లాంటిదా లేకపోతే ఏ రూపంలో  ఉంటుంది అనే విషయం తెలియాల్సివుంది,అయితే ఈకార్యక్రమంలో అర్నబ్ అరుపులు మాత్రం ఖాయం.