Arnella's jail sentence for murdering his wife..finally his wife..
mictv telugu

భార్యను హత్య చేశాడని, ఆర్నెల్ల జైలు శిక్ష..చివరికి భార్య..

September 9, 2022

తమ కూతురిని వరకట్న వేధింపులతో ఆమె భర్త (అల్లుడు) అతికిరాతకంగా తగులబెట్టి, చంపేశాడని సాక్షాత్తు అత్తామామలే అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపినా కోర్టు..నిందితుడికి ఆరు నెలలపాటు జైలు శిక్షను విధిస్తూ, ధర్మాసనం తీర్పును వెలువరించింది. అయితే, అసలు విషయం అప్పుడే బయటికి వచ్చింది. అనుమానం వచ్చి అధికారులు లోతైన విచారణ చేపట్టగా నిందితుడి భార్య నిక్షేపంగా బతికే ఉందని పోలీసులకు తెలియడంతో విస్తుపోయారు.

వివరాల్లోకి వెళ్తే..బిహార్‌లోని సీతామఢీ జిల్లా చోరౌత్ పోలీస్ స్టేషను పరిధిలో ఈ ఘటన జరిగింది. పరిగావన్ గ్రామవాసి శకుమార్‌కు నేపాల్‌కు చెందిన హీరాదేవితో వివాహమై, ఏడాది కుమారుడు ఉన్నాడు. ఏడు నెలల కిందట హీరాదేవి అదృశ్యం కావడంతో, అల్లుడే తమ అమ్మాయిని చంపేశాడని సాక్షాత్తు అత్తామామలు శశికుమార్‌పై కేసు పెట్టారు. దీంతో అరెస్టయిన శశికుమార్ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆర్నెల్ల అనంతరం చనిపోయిందనుకున్న హీరాదేవి నేపాల్లోని పుట్టింట్లో క్షేమంగానే ఉందని తెలియడంతో భర్త పోలీసులపై ఆగ్రహించాడు. ఆరోజు తాను హత్య చేయలేదని పదే పదే చెప్పిన వినకుండా తనకు ఆర్నెల్లపాటు శిక్షను వేశారని ఆవేదన చెందాడు. అయితే, ఆమెకు మతిస్థిమితం లేనందున తప్పిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.