Arpita Mukherjee's second flat was searched by ED..A total of Rs.29 crores was seized
mictv telugu

అర్పితా ముఖర్జీ రెండో ఫ్లాట్‌లో ఈడీ సోదాలు..ఏకంగా రూ.29 కోట్లు స్వాధీనం

July 28, 2022

స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన మరో ఫ్లాట్‌లో గురువారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 28.90 కోట్ల నగదు, 5 కేజీల బంగారం, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును కుంభకోణం ద్వారా కూడగట్టినదేనని అనుమానిస్తున్నారు.

ఇటీవలే ఆమె మొదటి ఫ్లాట్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ. 21.90 కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు తాజాగా రెండో ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించారు. దీంతో మొదటి ప్లాటో కంటే రెండవ ప్లాటోనే రూ. 28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా బంగారం, పలు డాక్యుమెంట్లు దొరికాయి.

అయితే, అర్పిత మొదటి ఫ్లాట్‌లో జరిపిన సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారం ఎక్కడిది? అనే ప్రశ్న వేయగా, ఆమె దానికి మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదని తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ నగదు అంత తరలించాలని అనుకున్నారని, కానీ అప్పటికే ఈడీ అధికారులు దాడి చేయడంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని అధికారులు తాజా విషయాలను వెల్లడించారు.