దుర్గమ్మ దర్శనానికి అధికారుల ఏర్పాట్లు - MicTv.in - Telugu News
mictv telugu

దుర్గమ్మ దర్శనానికి అధికారుల ఏర్పాట్లు

May 15, 2020

Durgamma Temple

లాక్‌డౌన్‌తో నెలన్నరగా మూతపడ్డ ఆలయాలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయాల్లో భక్తులను అనుమతించే దిశలో ఆలయాలు సిద్ధం అవుతున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనానికి టీటీడీ ఇప్పటికే ఆ కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గంటకు 250 మంది భక్తులకు మించకుండా దర్శనం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ నెంబర్‌తో పాటు దర్శన సమయాన్ని ఫోన్‌లో సందేశాల రూపంలో భక్తులకు తెలపనున్నారు. అయితే అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థం పంపిణీ నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అలాగే అమ్మవారి దర్శనం కోసం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని.. 24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. భక్తుల దర్శన సమయాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతించేలా యోచిస్తున్నారు.