హైదరాబాద్ లో ఈ నెల 5న జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్ ఎంసీ భారీ ఏర్పాటు చేసింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా పలు సదుపాయాలు కల్పించనుంది. ఈ వివరాలను అధికారులు వెల్లడించారు.
* రోడ్ల మరమ్మతులు, శాంతి భద్రతల పరిరక్షణ, సాఫీగా నిమజ్జన కార్యక్రమ నిర్వహణ, కనీస సౌకర్యాల ఏర్పాటుకు జీహెచ్ఎంసి, జలమండలి, పోలీసు, హెచ్ఎండిఏ, నీటి పారుదల శాఖ, రెవెన్యూ తదితర శాఖలచే విస్తృత ఏర్పాట్లు
* నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఏవిధమైన సమస్యలు ఉన్నా డయల్ 100, జీహెచ్ఎంసి కాల్ సెంటర్ 040-21111111లతో పాటు మై జీహెచ్ఎంసి యాప్ ద్వారా తమ దృష్టికి తేవాల్సిందిగా విజ్ఞప్తి.
* జీహెచ్ఎంసీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ.
* నగరంలో నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, అదనపు విద్యుత్ దీపాల ఏర్పాటు, తాత్కాలిక మరుగు దొడ్ల ఏర్పాటు, అదనపు వాహనాల ఏర్పాటు
* హుస్సేన్‌సాగర్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫిగా జరగడానికి ఫ్లాట్‌ఫాంల నిర్మాణం, శానిటేషన్ ఏర్పాటు.
* ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్ల వద్ద పురుషులకు 20 తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, మహిళలకు 10 టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
* హుస్సేన్ సాగర్‌తో పాటు 23 చెరువుల్లో నిమజ్జనం.
* ప్రధాన నిమజ్జనం కాప్రా చెరువు, సరూర్‌నగర్, రాజన్నబావి, మీరాలంట్యాంక్, హస్మత్‌పేట్ చెరువు, ప్రగతినగర్ చెరువులు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, మల్కంచెరువు, గోపినగర్ చెరువు, గురునాథంచెరువు, హపీజ్‌పేట్ కైదమ్మకుంట, వినాయక్‌నగర్ ఎర్లచెరువు, ఆర్.సి.పురం రాయసముద్రం చెరువు, పటాన్‌చెరులోని సాకి చెరువు, ఐ.డి.ఎల్ ట్యాంక్, పరికిచెరువు, వెన్నెలగడ్డ చెరువు, సూరారం చెరువు, అల్వాల్ కొత్త చెరువు, సఫిల్‌గూడ చెరువు, పల్లెచెరువు, పత్తికుంట చెరువుల వద్ద కూడా విస్తృత ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.
హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాటు
* ప్రతి మూడు, నాలుగు కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటు.
* ప్రతి యాక్షన్ టీమ్‌లో ఒక శానిటరీ సూపర్వైజర్, ముగ్గురు ఎస్ఎఫ్ఏలు, 21మంది పారిశుధ్య సిబ్బంది ఉంటారు.
* మొత్తం 388.5కిలోమీటర్ల విస్తీర్ణంలో 168 గణేష్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటు.
* 118మంది శానిటరీ సూపర్వైజర్లు, జవాన్లు, 475మంది ఎస్ఎఫ్ఎలు, 5,305మంది పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక నియామకం.
* 203 వాహనాల ఏర్పాటు
ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వద్ద ఏర్పాట్లు
- గణేష్ విగ్రహాల నిమజ్జనానికి 23భారీ క్రేన్ల ఏర్పాటు.
- ప్రతి మూడు క్రేన్ల వద్ద ప్రతి షిఫ్టులో 21మంది ఎంటమాలజి వర్కర్ల ఏర్పాటు.
- మొత్తం 531మంది ఎంటమాలజి సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
- ఎన్టీఆర్ మార్గ్ వద్ద పది భారీ క్రేన్ల ఏర్పాటు.
- ప్రతి మూడు క్రేన్ల వద్ద షిఫ్టుల వారీగా పనిచేయడానికి 231మంది ఎంటమాలజి సిబ్బంది నియామకం.
- నిమజ్జనం సందర్భంగా వెలువడే వ్యర్థాల తొలగింపుకు 25టన్నుల సామర్థ్యం గల ఆరు వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు.
- 40 మినీ టిప్పర్లు, 6ఫ్రంట్ ఎండ్ లోడర్లు, 4జె.సి.బిలు, ఆరు బాబ్కాట్లు, 20 స్మాల్ స్వీపింగ్ మిషన్లు, ఆరు బిగ్ స్వీపింగ్ మిషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.
- జీహెచ్ఎంసి పరిధిలో మొత్తం 23చెరువుల వద్ద నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
గణేష్ విగ్రహాల నిమజ్జనానికి 25 ప్రత్యేక కొలనుల నిర్మాణం.
* నగరంలోని చెరువులు కలుషితం కాకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గత సంవత్సరంలో 10, ప్రస్తుత సంవత్సరంలో 15 ప్రత్యేక కొలనులను నిర్మించడం జరుగుతోంది.
* బెంగళూర్ నగరం అనంతరం ఈ ప్రత్యేక కొలనులను నిర్మించిన నగరం హైదరాబాద్.
గత సంవత్సరం నిర్మించిన నిమజ్జన కొలనుల వివరాలు
- హుస్సేన్‌సాగర్ లేక్, సికింద్రాబాద్, 2. ఊరచెరువు, కాప్రా, 3. చర్లపల్లి ట్యాంక్ – చర్లపల్లి, 4. పెద్ద చెరువు-శేరిలింగంపల్లి, 5. వెన్నల చెరువు – జీడిమెట్ల, 6. రంగధాముని కుంట – కూకట్పల్లి, 7. మల్క చెరువు – రాయదుర్గ్, 8. నలగండ్ల చెరువు – నలగండ్ల, 9. పెద్ద చెరువు – సరూర్‌నగర్, 10. పరికి చెరువు-కూకట్పల్లి,
ప్రస్తుత సంవత్సరంలో నిర్మింస్తున్న నిమజ్జన కొలనుల వివరాలు
- పెద్దచెరువు-నెక్నాంపూర్, 2. లింగంచెరువు-సూరారం, 3. ముళ్లకత్వచెరువు-మూసాపేట్, 4. పత్తికుంట-రాజేంద్రనగర్, 5. బోయిన్‌చెరువు-హస్మత్‌పేట్, 6. నాగోల్‌చెరువు, 7. అల్వాల్-కొత్తచెరువు, 8. నల్లచెరువు- ఉప్పల్, 9.సాకిచెరువు -పటాన్చెరు, 10. రాయసముద్రం చెరువు- రామచంద్రాపురం, 11. హస్మత్‌పేట్-కైదమ్మకుంట, 12. మియాపూర్-గురునాథ్‌చెరువు, 13.లింగంపల్లి- గోపిచెరువు, 14. రాయదుర్గ్ – దుర్గంచెరువు, 15. హుస్సేన్‌సాగర్ చెరువు- అంబేద్కర్‌నగర్.
* గణేష్ మండపాలు, శోభయాత్ర మార్గంలో ఎప్పటికప్పుడు గార్బెజ్, రాళ్లు ఇతర నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం.
* గణేష్ మండపాలు, దేవాలయాలకు దారితీసే రహదారులపై అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం.
* దేవాలయాలు, గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు.
* ఈ నెల సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరిగే శోభయాత్ర ఊరేగింపు మార్గంలో ఏవిధమైన చెత్త కుండీలు లేకుండా చర్యలు.
* బ్లీచింగ్ పౌడర్, సున్నపు పౌడర్‌ను శోభయాత్ర మార్గంలో వేయడం.
* ప్రతిరోజు కనీసం రెండు సార్లు చెత్తను తొలగించడం.
* దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగ్ చేపట్టడం.
* గణేష్ నవరాత్రుల సందర్భంగా వచ్చే అదనపు వ్యర్థాలను తొలగించడానికి కావాల్సిన అదనపు వాహనాల ఏర్పాటు.
* రోడ్లపై ఏవిధమైన పశువులు లేకుండా చూడటానికి చీఫ్ వెటర్నరీ అధికారి ప్రత్యేక చర్యలు.
* ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, నక్లెస్రోడ్లలో వ్యర్థపదార్థాల తొలగింపు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు.
* నగరంలోని ట్యాంక్‌బండ్‌తో సహా ఇతర నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు.
* నిమజ్జన ప్రాంతాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, పూలు, పత్రిని తొలగించడానికి చర్యలు.
* ట్యాంక్‌బండ్, దక్కన్ కాంటినెంటల్ ఎదురుగా ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాలతో పాటు నగరంలోని అన్ని ప్రధాన నిమజ్జన ప్రాంతాల వద్ద తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు.
* ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు