రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అరెస్ట్ చేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ నుంచి పిల్లలను రష్యాకు చట్టవిరుద్ధంగా పంపించారనే నేం మీద అరెస్ట్ చేయాలని ఐసీసీ తీర్మానించింది.
లాస్ట వన్ ఇయర్ గా ఉక్రెయిన్ మీద రష్యా దాడులు చేస్తోంది. అందులో భాగంగా ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల్లోని చిన్నరులను రష్యాకు చట్ట విరుద్ధంగా రవాణా చేయడమే కాక పలు యుద్ధ నేరాలకు కూడా పాల్పడింది. ఇవే నేరాల కింద ఐసీసీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వోవా బెలోవాకు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. భ్రదతామండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల్లో ఒక దేశం అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇదే మొదటిసారి.
మరోవైపు అరెస్ట్ వారెంట్ మీద రష్యా స్పందించింది. వారెంట్ ను మేము లెక్క చేయం అని చెప్పింది. అసలు ఐసీసీనే తాము గుర్తించడం లేదని అలాంటప్పుడు అది జారీ చేసిన అరెస్ట వారెంట్ ను ఎందుకు పట్టించుకుమని అంటోంది. ఇక ఐసీసీ చర్యను ఉక్రెయిన్ సమర్ధించింది.