పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్

June 30, 2020

expm

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జార్ధారీకి యాంటీ కరప్షన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2008 నాటి లగ్జరీ వెహికల్స్ కేసులో ఆయన విచారణకు హాజరుకాలేదని బెయిలబుల్ వారెంట్ జారీచేశారు. జర్దారీకి బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేస్తున్నట్లు అకౌంటబిలిటీ కోర్టు జడ్జి అస్ఘర్ అలీ ప్రకటించారు. తదుపరి విచారణ ఆగస్టు 17న జరుగుతుందని తెలిపారు.

మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, యూసఫ్ రజ గిలానీలకు లగ్జరీ కార్లుకు అసలు ధరల్లో 15 శాతం మాత్రమే చెల్లించారని.. మిగతా డబ్బును ప్రభుత్వ ఖజానా నుంచి వాడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో  అసిఫ్ అలీ జర్ధారీ తరుపు న్యాయవాది తన క్లయింట్ వృద్దుడని.. ఆయన కోర్టుకు హాజరైతే కరోనా సోకుతుందని.. ఆయనకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు.  కనీసం కరోనా పరిస్థితి మెరుగుపడేంత వరకు అయినా మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.