Cheetahs : నేడు భారత్‎కు మరో 12 చిరుతలు..కునో నేషనల్ పార్కులో నెలరోజులు క్వారంటైన్.!! - MicTv.in - Telugu News
mictv telugu

Cheetahs : నేడు భారత్‎కు మరో 12 చిరుతలు..కునో నేషనల్ పార్కులో నెలరోజులు క్వారంటైన్.!!

February 18, 2023

భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు ఇండియాకు రానున్నాయి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కుకి ఈ చిరుతలు వెళ్లనున్నాయి. దీనికి సంబంధించి సన్నాహాలు చేశారు అధికారులు. ఈ రెండో విడతలో 7 మగ చిరుతలు, 5 ఆడ చిరుతలున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహన్‎లు కునో నేషనల్ పార్కులోని తమ క్వారంటైన్ ఎన్‎క్లోజర్‎లలోకి చిరుతలను వదులుతాయని మధ్యప్రదేశ్ మీడియా తెలిపింది.

 

ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతేడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి కూనోలోని క్వారంటైన్ ఎన్‎క్లోజర్‎లోకి 5 చిరుతలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకురావడానికి భారత వైమానిక దళం సి -17 గ్లోబల్ మాస్టర్ గురువారం ఉదయం 6గంటలకు హిండెన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం గౌటెంగ్ లోని ఓ ఆర్ టాంబో అంతర్జాతీయ విమానశ్రాయం నుంచి చిరుతలు కూనోకు ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి.

రెండో బ్యాచ్ చిరుతలు శనివారం ఉదయం ఎంపీలోని గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంటాయి. వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న షియోపూర్ జిల్లాలోని కునో పార్కుకి తీసుకెళ్తారు. ఆ తర్వాత వాటిని క్వారంటైన్ ఎన్ క్లోజర్ లో ఉంచుతారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ చిరుతలు కునో నేషనల్ పార్కులోని క్వారంటైన్ లో 1 నెలపాటు ఉండాలి. భారత్, దక్షిణాఫ్రికా ఒప్పంద ప్రకారం దక్షిణాఫ్రికా నుంచి ప్రతిఏటా 10 నుంచి 12 చిరుతలను రాబోయే 10సంవత్సరాల్లో దేశానికి తీసుకురావాలి.