దుర్యోధనుడు అలాగే పతనమయ్యాడు.. ప్రియాంక గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

దుర్యోధనుడు అలాగే పతనమయ్యాడు.. ప్రియాంక గాంధీ

May 7, 2019

మోదీ దుర్యోధనుడిలా దురహంకారి అని ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు ఉత్తర ప్రదేశ్ (పశ్చిమ) కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. హర్యానాలోని అంబాలాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీని దుర్యోధనుడితో పోల్చారు.

‘మోదీ దుర్యోధనుడిలా దురహంకారి. ఆయన అహంకారమే తాజా ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణమవుతుంది. బీజేపీ నాయకులు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయారు. వాటి అమలు గురించి ఎక్కడా మాట్లాడటం లేదు’ అని దుయ్యబట్టారు. దేశంలో ఏ సమస్యా లేనట్టు బీజేపీ వారు పదేపదే రాజీవ్ గాంధీని విమర్శించడాన్ని ప్రియాంక తిప్పికొట్టారు.