పెయింటింగ్ కాదు.. టీవీనే.. - MicTv.in - Telugu News
mictv telugu

పెయింటింగ్ కాదు.. టీవీనే..

September 9, 2017

ఒకప్పుడు చెక్కపెట్టెల్లా భారీ సైజులో ఉండిన టీవీలు రానురాను నాజూగ్గా తయారవుతూ వస్తున్నాయి. శాంసంగ్ ఇండియా తాజాగా మరింత సొగసైన టీవీని మార్కెట్లోకి తీసుకొస్తోంది. గోడకు తగిలించుకునే పెయింటింగ్ లా ఉండడం దీని ప్రత్యేకత. ‘ఇన్నోవేటివ్‌ లైఫ్‌స్టయిల్ టీవీ.. ద ఫ్రేమ్‌’ పేరుతో ఈ నెల 14 మన దేశ మార్కెల్లోకి ఇది అందుబాటులోకి రానుంది. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన ఈ స్మార్ట్‌ టీవీని ఒక పెయింటింగు మాదిరిగా కూడా వాడుకోవచ్చని శాంసంగ్ ఇండియా జనరల్‌ మేనేజర్‌ పీయూష్‌ కున్నపల్లి చెప్పారు.

యుహెచ్‌డీ పిక్చర్‌ క్వాలిటీతో కూడిన ఈ స్మార్ట్‌ టీవీని చిత్రకళాఖండాలను  ప్రదర్శించేలా తయారు చేశామన్నారు.  ప్రత్యేకమైన డిజైన్‌తో తక్కువ మందంతో గోడకు తగిలించే విధంగా రూపొందించామన్నారు. దీనికి వైర్లు కనిపించవని, ఒకే వైర్లో స్పీకర్, డిష్ కనెక్షన్ ను ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. 55 అంగుళాలు, 65 అంగుళాల సైజులో ఇవి లభ్యమవుతాయన్నారు. వీటి ధరలు వరుసగా రూ. 2,74,900, రూ. 3,99,900 అని వెల్లడించారు.