పాక్‌లో అరుదైన హనుమాన్ విగ్రహాలు లభ్యం
పాకిస్తాన్‌లో వందల ఏళ్లనాటి అతి పురాతనమైన, అమూల్యమైన విగ్రహాలు బయటపడ్డాయి. కరాచీ నగరంలోని సోల్జర్ ప్రాంతంలో ఉన్న ప్రఖ్యా పంచముఖ హనుమాన్ ఆలయంలో అభివృద్ధి పనుల కోసం త్వకాలు జరుపుతుండగా వీటిని కనుగొన్నారు. ఎంతో అమూల్యమైన రాయితో చెక్కిన హనుమంతుడు, నంది, వినాయకుడి విగ్రహాలు కనిపించాయి. వాటిపై సింధూరం ఆనవాళ్ల కూడా కనిపిస్తున్నాయి. ఇవి సుమారు 15 వందల సంవత్సరాల నాటివిగా ఆలయ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.
కేవలం రెండు మూడు అడుగుల లోతు తవ్వకాలు జరిపిన వెంటనే ఈ విగ్రహాలు బయటపడినట్టు ఆలయ ధర్మకర్త రామ్‌నాథ్ మహారాజ్ తెలిపారు. ఏళ్లనాటి అపురూపమైన విగ్రహాలు బయటపడటంతో ఈ ఆలయాన్ని అక్కడి ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పంచముఖ హనుమాన్ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సహజంగా సృష్టించిన హనుమంతుడి విగ్రహం ఉందని భక్తులు విశ్వసిస్తారు.