Arun Goyal appointed as Commissioner of Central Election Commission
mictv telugu

కేంద్ర ఎన్నికల సంఘానికి నూతన కమిషనర్ నియామకం

November 19, 2022

కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియమితులయ్యారు. గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణ్ గోయల్ 1985 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. అయితే సర్వీసులో ఉండగానే ఈయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కాగా, ఇప్పటివరకు ఆ పదవిలో రాజీవ్ కుమార్ ఉన్నారు. ఈయన గత మే నెలలోనే బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకోవడం ప్రస్తావనార్హం.