చైనాకు గట్టి ఆన్సరిచ్చిన ఇండియా..... - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు గట్టి ఆన్సరిచ్చిన ఇండియా…..

July 7, 2017

చైనా కూతలకు, రాతలకు భారత్ గట్టి జవాబే ఇచ్చింది. ఇక భారత్ తో చర్చలు లేనట్లే అని చైనా  అన్న మాటలకు  చర్చలు  చేయడానికి సమావేశం ఏర్పాటు చేయాలని తాముఎవ్వరినీ అడగ లేదని భారత్  జవాబిచ్చింది.  వారం రోజులుగా రెండు దేశాల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం  తెల్సిందే. అయితే జర్మనీలో జరుగుతున్న జీ 20  సదస్సు సందర్భంగా భారత ప్రధాన మంత్రి మోదీ, చైనా అధ్యక్షులు జీజిన్ పింగ్ సరిహద్దు విషయంపై చర్చలు జరిగే అవకాశం లేదని చైనా అన్నది. దీనికి భారత్  ఘాటుగా రియాక్ట్ అయింది. సమావేశం పెట్టాలని తాము అడగనప్పుడు ఇక చర్చల ప్రస్తావనే లేదని తెగేసి చెప్పింది.

తాఢాకా చూపిస్తామని డ్రాగన్ అంటే… అంత సీన్ లేదు… ఇంతకు ముందున్న ఇండియా కాదిది అని జైట్లీ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా ఇరు వైపుల నుండి మాటల యుద్దం నడుస్తనే ఉంది. అయితే చైనా మీడియా మాత్రం మితిమీరిన రాతలు రాస్తున్నదనే అభిప్రాయం ఇక్కడున్న కొందరిలో వ్యక్తం అవుతున్నది.

సిక్కిం వివాదంలో ఇరు దేశాలు పట్టు వీడటం లేదు. చైనా  చాలా వ్యూహాత్మకంగా భారత్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. ఎలాంటి లాజిక్ లు ప్లే చేసినా ఇండియా మాత్రం ఇంచు కూడా వెనుకకు జరగడం లేదు. డోక్ లామ్ ఏరియా నుండి చైనా సైన్యాలు వెళ్లందే తాము వెళ్లేది లేదని… ఇండియా  గట్టిగా చెప్తున్నది.

ఇప్పటికైతే ఇరు దేశాల పెద్ద నాయకుల మధ్య చర్చలు సంప్రదింపులకు సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. అలాంటి ఛాన్స్ లేకుండనే ఇరు  వైపులా  ఎత్తుగడలు మారుస్తూ… ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి ఇరు దేశాలు. గత చరిత్ర సంగతి ఎట్లా ఉన్నా….  ప్రపంచీకరణ యుగంలో యుద్దం అంత ఈజీకాదు… మరి ముందు ముందు దీని పరిణామాలు ఎట్లా  ఉంటాయో.