Home > Featured > అరుణ్ జైట్లీ కి ఇష్టమైనది ఇదే..!

అరుణ్ జైట్లీ కి ఇష్టమైనది ఇదే..!

ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయనకు పలువురు రాజకీయ,సినీ,వ్యాపారవేత్తలు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. బీజేపీ నేతలు ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

మరోవైపు అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన తనకు వీలు చిక్కినప్పుడల్లా కిక్రెట్ చూసేందుకు వెళ్లేవారు. అందుకే ఆయన ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా 1999 నుంచి 2013 వరకు సుదీర్ఘ కాలం పనిచేశారు. కపిల్ సిబల్ కూడా జైట్లీతో కలిసి క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పోస్టు పెట్టి నివాళ్లు అర్పించారు. ఇక జైట్లీకి ఇష్టమైన బెండి ఆమ్ చూర్ వంటకం అంటే జైట్లీ ఎంతో ఇష్టంగా తింటారు.

అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. జీఎస్టీ,పెద్ద నోట్ల రద్దు సమయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

కాగా జైట్లీ పార్థివదేహాన్ని కైలాశ్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. ప్రముఖులు, రాజకీయ నేతలు, సన్నిహితుల సందర్శనం తర్వాత పార్టీ కార్యాలయానికి రేపు తరలించనున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated : 24 Aug 2019 4:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top