Aruna Miller was elected Lieutenant Governor of Maryland
mictv telugu

అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌‌గా ఎన్నికైన హైదరాబాదీ ఎన్నారై మహిళ

November 9, 2022

Aruna Miller was elected Lieutenant Governor of Maryland

సంపన్న దేశం అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భారత ఎన్నారై మహిళ అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. తెలుగు నేపథ్యం ఉన్న ఆమె మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌‌గా ఎంపియ్యారు. ఈ పదవిని అలంకరించిన మొదటి భారత సంతతి వ్యక్తి ఈమెనే కావడం గమనార్హం.

అమెరికాలోని రాష్ట్రాలకు గవర్నర్‌‌‌ ముఖ్య పాలనా అధికారిగా ఉంటారు. ఒకవేళ గవర్నర్ ఏదేని కారణం చేత సరిగ్గా విధులు నిర్వర్తించని పక్షంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆ బాధ్యతలు చేపడతారు. ఈ ఎన్నికల్లో గవర్నర్‌‌గా వెస్ మూర్ ఎన్నికయ్యారు. వీరిద్దరూ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేయగా, అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వీరి తరపున విస్తృత ప్రచారం చేశారు. కాగా, 58 ఏళ్ల వయసు ఉన్న అరుణా మిల్లర్ హైదరాబాదులో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడు అంటే 1972లో కుటుంబం అమెరికాకి వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. మేరీలాండ్‌‌లో అరుణకు ప్రజాదరణ ఎక్కువ. ఈమె మంచితనాన్ని చూసి ప్రతిపక్ష రిపబ్లికన్ నాయకులు కూడా ఈమెకు అనుకూలంగా పని చేశారని సమాచారం.