Home > Featured > అలాంటి పిల్లలకు ఎస్టీ హోదా రద్దు చేస్తున్న ప్రభుత్వం

అలాంటి పిల్లలకు ఎస్టీ హోదా రద్దు చేస్తున్న ప్రభుత్వం

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అలో లిబాంగ్ మంగళవారం కీలక విషయం వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన మహిళలు గిరిజనేతరులను పెళ్లి చేసుకుంటే అలా పుట్టిన పిల్లలకు ఎస్టీ హోదా రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లొంబో తయెంగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా తెలిపారు. ప్రభుత్వం ఆగస్టు 1న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అనర్హులకు జారీ చేసిన ఎస్టీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం నియమించిన స్క్రూటినీ కమిటీ ముందుకు 9 కేసులు వచ్చాయని వివరించారు. ఇందులోని 5 సర్టిఫికెట్లను ఇప్పటికే రద్దు చేసినట్టు సభ దృష్టికి తీసుకొచ్చారు. వెనుకబడ్డ గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

Updated : 7 Sep 2022 7:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top