ఎంత మాటన్నారండి అమ్మ గారు…. చాలా గొప్ప మాట చెప్పారు. వినడానికి రెండు చెవులు చాలడం లేదు. గుండె తరుక్కు పోయే వారు మాత్రం ఈ వార్త అస్సలు చదవొద్దు… చద్వినా వెంటనే మర్చిపోండి.. కనీసం మర్చి పోయే ప్రయత్నం చేయండి.. ఇటీవల జరిగిన ఘటనలు ఏవీ గుర్తుకు తెచ్చుకోవద్దు…
ఇక విషయంలోకి వెళ్దాం……
మన దేశంలో బ్యాంకులను ముంచి ఇతర దేశాల్లో జాల్సాలు చేస్తున్న వారి గురించి కొత్తగా చెప్పాల్సిందే మీ లేదు. ఇట్లా బ్యాంకులను ముంచిన పెద్దలు రెండు డజన్ల దాంక ఉన్నరని బ్యాంకు పెద్దలు సెలవిచ్చారు. మునిగిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ పెద్ద బ్యాంకు ఎస్బీఐ ముందు వరుసలో ఉంది. లక్షల కోట్ల రూపాయలు మొండి పద్దలున్నాయి… వాటిని వెంటనే వసూలు చేయాలని ఈ మధ్యనే మీడియాలో గట్టి వార్నింగ్ లాంటిదిచ్చినట్లు వార్తలు గుప్పమన్నాయి.ఆహా… అధికారులు మంచి పనిచేస్తున్నారని చానా మంది అనుకున్నారు… అట్లా అనుకున్న వారి ఆశలు.. ఆలోచనల మీద నీళ్లు చల్లి… నిప్పులాంట మా చెప్పారు పెద్దలు…..
అస్సలు విషయం ఏందంటే… పాపం వేల కోట్ల రూపాయలు తీసుకుని బ్యాంకులకు టోపీ వేసిన వారిది అస్సలు తప్పు కాదట. అభివృద్ధి క్షీణించి వారు అట్లా చేశారని ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధీ బాట్టాచార్య అన్నారు. బ్యాంకులను ముంచడాన్ని నేరంగా చూస్తున్నారని, అది తప్పని సెలవిచ్చారు. వేల కోట్ల అప్పులు తీసుకున్న వారిని అర్థం చేసుకున్న మీరు రైతులు తీసుకున్న వేల అప్పులకే ఎందుకు ఇండ్లుకు తాళాలేస్తున్నారో చెప్పరు. ఇంటిల్లి పాదిని రోడ్డు పాలు చేసి గిన్నెలు, చెంబులు ఎందుకు పట్టుకుపోతారో సెలవియ్యరు. కాలం కల్సి రాకా… నకిలీ విత్తనాల దెబ్బకు రైతులు నిండా మునుగుతున్నారు. మరి రైతుల సంగతి ఎందుకు గుర్తుకు రాదో.
‘‘అంతే లే పేదల గుండెలు… అశ్రువులే నిండిన కుండలు…’’ అన్నాడు అప్పట్ల ఓ మహాకవి. దాంతో సరి పెట్టుకుంటే సరిపోతుంది కావొచ్చు.