జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ పూరీ బీచ్‌లో కేసీఆర్ సైకత శిల్పం - MicTv.in - Telugu News
mictv telugu

జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ పూరీ బీచ్‌లో కేసీఆర్ సైకత శిల్పం

October 3, 2022

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించబోతున్నారు. దసరా సందర్భంగా కొత్త పార్టీని, జెండాను, గుర్తును ప్రకటించనున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. దేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు వనరుల సమర్ధ వినియోగం, ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే ఉద్దేశంతో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథుడు కొలువు దీరిన పూరీ సముద్ర తీరంలో టీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ కేసీఆర్ పార్టీని స్వాగతిస్తూ సైకత శిల్పాన్ని రూపొందింపజేశారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, దేశ్‌ కీ నేతా కేసీఆర్, కిసానోంకా భరోసా, వెల్కం టు నేషనల్ పాలిటిక్స్ అంటూ స్వాగతించారు. కేసీఆర్ తలపెట్టిన లక్ష్యం సాకారమవ్వాలనే అభిలాషతో సైకత శిల్పాన్ని తయారు చేయించినట్టు అరవింద్ పేర్కొన్నారు. అక్కడి పర్యాటకులు సైకత శిల్పాన్ని ఆసక్తిగా తిలకించారని, పలువురు ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారని వెల్లడించారు.